close
Choose your channels

'మౌన‌మే ఇష్టం' టీజ‌ర్ విడుద‌ల‌

Saturday, February 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మౌన‌మే ఇష్టం టీజ‌ర్ విడుద‌ల‌

రామ్ కార్తీక్‌, పార్వ‌తి అరుణ్ జంట‌గా ఆర్ట్ డైరెక్ట‌ర్ అశోక్ కుమార్ కోరాల‌త్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `మౌన‌మే ఇష్టం`. ఈ చిత్ర టీజ‌ర్ ను ప్ర‌ముఖ నిర్మాత శ్యాం ప్ర‌సాద్ రెడ్డి విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ `` ట్రైల‌ర్ చాలా రిచ్‌గా వుంది. కెమెరామెన్ చ‌క్క‌టి ప‌నిత‌నాన్ని చూపించారు. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

ద‌ర్శ‌కుడు అశోక్ కుమార్ కోరాల‌త్ మాట్లాడుతూ `` ల‌వ్ ఎక్స్‌ప్రెష్ చేయ‌డానికి ఒక జంట మ‌ధ్య జ‌రిగే సంఘ‌ర్ష‌ణే ఈ చిత్ర‌క‌థ‌.... సినిమా పోయెటిక్ వేలో వుంటుంది. సినిమా విజువ‌ల్స్ ఇప్ప‌టి యువ‌త‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటాయి`` అన్నారు.

హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ `` ద‌ర్శ‌కుడు అశోక్ గారు చిత్రాన్ని అద్బుతంగా తెర‌కెక్కించారు. ప్ర‌తి ఫ్రేము ఆయ‌న ఆర్ట్ వ‌ర్క్ లాగే పెయింటింగ్ లా వుంటుంది. ఈ సినిమాకు సంగీతం ప్ర‌త్యేక ఆక‌ర్శ‌ణ‌గా నిలుస్తుంది. నాజ‌ర్ పాత్ర ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. సినిమా మొద‌ట్నుంచి ఒక కావ్యాన్ని చ‌దువుతున్న‌ట్టు వుంటుంది. ఈ చిత్రంలో న‌టించ‌డం అద్రుష్టంగా భావిస్తున్నాను`` అన్నారు.

ఈ చిత్రానికి క‌థః సురేష్ గ‌డిప‌ర్తి, సంగీతంః వివేక్ మ‌హాదేవ్‌, కెమెరాః జె.డి. రామ తుల‌సి, నిర్మాతః ఆశా అశోక్, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వంః అశోక్ కుమార్ కోర‌ల‌త్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.