‘మౌనరాగం’ ఫేమ్ శ్రావణి ఉసురు తీసిన టిక్‌టాక్...

  • IndiaGlitz, [Wednesday,September 09 2020]

‘మౌనరాగం’ ఫేమ్ శ్రావణి మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. టిక్‌టాక్ ఆమె జీవితాన్ని బలి తీసుకుంది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మధుర నగర్ హెచ్ 56 బ్లాక్ రెండవ ఫ్లోర్‌లో బాత్‌రూమ్‌లో శ్రావణి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాత్‌రూమ్‌లో నుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు డోర్ పగులగొట్టుకుని లోపలికి వెళ్లేసరికే ఆమె విగతజీవిగా పడి ఉంది. వెంటనే శ్రావణిని కుటుంబ సభ్యులు యశోద హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తేల్చారు.

అసలు విషయం ఏంటంటే.. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డితో శ్రావణికి టిక్ టాక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. తనకు తల్లిదండ్రులు లేరంటూ శ్రావణితో స్నేహం పెంచుకున్న దేవరాజ్ గత కొంతకాలంగా ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రావణి మంగళవారం రాత్రి సమయంలో బాత్రూంలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు.

దేవరాజు రెడ్డి వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని శ్రావణి కుటుంబ సభ్యులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శ్రావణి మృతికి కారణమైన దేవరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ వారు డిమాండ్ చేస్తున్నారు. శ్రావణి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, శ్రావణి గత ఎనిమిది సంవత్సరాలుగా టెలివిజన్ రంగంలో రాణిస్తోంది. ‘మనసు మమత’ సీరియల్ ద్వారా ఫేమస్ అయిన శ్రావణి.. ప్రస్తుతం ‘మౌనరాగం’ సీరియల్‌లో కూడా నటిస్తోంది.

More News

డైరెక్టర్‌కి ఖరీదైన కారుని గిఫ్ట్‌ ఇచ్చిన నితిన్‌..!

ఈ మధ్య కాలంలో హీరోలు వారికి నచ్చిన వారికి అంటే దర్శకులకు, టెక్నీషియన్స్‌కు తమకెంతో ఇష్టమైన శ్రేయోభిలాషులకు ఖరీదైన కార్లను గిఫ్ట్‌గా ఇస్తున్నారు.

పిఠాపురం, అంతర్వేది ఘటనలు యాధృచ్చికాలు కావు: పవన్

అంతర్వేదిలో రథం దహనమైన ఘటనపై జనసేన అధినేత తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మతిస్థిమితం లేని వారు చేసిన పనో..

చిన్నపాటి యుద్ధానికి వేదికగా మారిన గాంధీభవన్..

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏ మీటింగ్ నిర్వహించాలన్నా.. గాంధీభవన్‌లోనే నిర్వహిస్తుంటారు. కానీ ఈ మధ్య గాంధీభవన్ బాహాబాహీలకు..

'డిటెక్టివ్ 2' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన విశాల్‌

హీరో , నిర్మాత అయిన విశాల్ ద‌ర్శ‌కుడిగా మారి తెర‌కెక్కించిన చిత్రం డిటెక్టివ్ 2. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు.

డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ రిలీజ్ చేసిన `రాధాకృష్ణ` చిత్రంలోని `తంగేడు పువ్వు` లిరిక‌ల్ వీడియో సాంగ్‌

``తంగేడు పువ్వులాంటి  నా బుగ్గ‌మీద నా సిందూరం పూసిండే  సిల‌కో... గుళ్ళోన గంట‌లాంటి నా గొంతు మీద‌నా మౌనాలు చ‌ల్లిండే మొల‌కో..నీలాల క‌న్నుల్లో మెరుపున్నోడే