close
Choose your channels

వైసీపీలోకి సినీ హీరో.. టాప్ బిజినెస్‌మెన్!

Sunday, February 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైసీపీలోకి సినీ హీరో.. టాప్ బిజినెస్‌మెన్!

ఆంధ్రప్రదేశ్‌‌‌లో వైసీపీ ‘ఫ్యాన్’ గాలి గట్టిగా వీస్తుండగా.. మరో వైపు టీడీపీ ‘సైకిల్’ గాలి రోజురోజుకు తగ్గుతోంది!. ఇందుకు కారణం తాజా రాజకీయ పరిణామాలే. 2014 ఎన్నికలు అవ్వగానే సీఎం చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను ఏ విధంగా అయితే పార్టీలో చేర్చుకున్నారో.. అదే విధంగా ఎన్నికల ముందు వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి సిట్టింగ్‌‌ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను వైసీపీలో చేర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. కాగా ఇప్పటికే పలువురు కీలకనేతలు వైసీపీ కండువా కప్పుకోగా.. మరికొందరు క్యూలో ఉన్నారని తెలుస్తోంది. అయితే త్వరలో వైఎస్ జగన్‌‌ కుటుంబ సమేతంగా లండన్‌‌కు వెళ్తుండటంతో తిరిగొచ్చాక యథావిథిగా చేరికలు ఉంటాయని వైసీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. అయితే వైసీపీలో చేరాలనుకుంటున్నది ఎవరు..? సినీ ఇండస్ట్రీ నుంచి చేరుతున్నదెవరు..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రాజకీయాల్లోకి దాసరి కుమారుడు!?

సీనీ ఇండస్ట్రీ నుంచి ఇద్దరు ప్రముఖలు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. వారిలో ఒకరు దివంగత నటుడు, నేత దాసరి నారాయణరావు కుమారుడు దాసరి కిరణ్ కుమార్. సినిమాల్లో అనుకున్నంత సక్సెస్‌‌‌ కాలేకపోయిన అరుణ్.. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని తహతహలాడుతున్నట్లు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి-దాసరి కుటుంబానికి మంచి బంధాలే ఉన్నాయి. బహుశా ఇప్పుడు దాసరి బతికుంటే వైసీపీలో ఎప్పుడో చేరుండేవారు!. మీరు ఓకే అంటే తాను రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నానని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌‌కు.. అరుణ్‌‌ ఫోన్ చేసి మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే జగన్ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది..? ఆయన ఏమని హామీ ఇచ్చారనే విషయం తెలియరాలేదు.

టాప్ బిజినెస్‌మెన్..

మరొకరు ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత పొట్లూరి వరప్రసాద్. ఈయన గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులే. వ్యాపార రంగంలో తనదైన చక్రం తిప్పిన పీవీపీ రాజకీయాల్లోకి రావాలని ఎప్పట్నుంచే ఎదురుచూస్తున్న ఆయన 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయవాడ నుంచి పోటీ చేయాలని భావించారని టాక్. అయితే చివరి నిమిషంలో నోటికాడ ముద్దను తన్నుకెళ్లినట్లుగా ప్రస్తుత ఎంపీ కేశినేని నాని టికెట్ తన్నుకెళ్లారట. ఈసారి ఎలాగైనా సరే ఎంపీగా పోటీ చేయాలని మరో ప్రయత్నం మొదలుపెట్టాడట. అయితే టీడీపీలోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్న ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుని విజయవాడ ఎంపీగా బరిలోకి దిగాలని అనుకున్నారట. ఇక అన్నీ అయిపోయాయ్.. పార్టీలో చేరికే ఆలస్యం అనుకుంటున్న టైమ్‌‌‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జై రమేశ్ వైసీపీలో చేరారు. జై కే దాదాపుగా విజయవాడ ఎంపీ టికెట్ కూడా ఫిక్స్ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయనుకు ఏం చేయాలో దిక్కు తోచట్లేదట. ఏదైతేనేం మొదట పార్టీలో చేరండి.. తర్వాత అధినేతే టికెట్ సంగతి తేలుస్తారని ఒకరిద్దరు వైసీపీ నేతలు ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

సో వీరిద్దరి రాక దాదాపు ఖాయమైనట్లేనని.. వైసీపీ కీలకనేత, ఎంపీ విజయసాయిరెడ్డితో ఇదివరకే చర్చించారని తెలుస్తోంది. అయితే ఈ చేరిక ఎంత వరకు నిజమవుతుంది..? ఈ ఇద్దరిలో ఎవరు నిజంగానే వైసీపీలో చేరతారు..? పుకార్లకు ఫుల్‌స్టాప్ పడుతుందా..? నిజమవుతాయా..? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి. కాగా ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకున్న థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి అధిష్టానం గుర్తించి కీలక పదవి అప్పగించిన సంగతి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.