స్ట్రింగ్ ఆప‌రేష‌న్‌లో అడ్డంగా బుక్కైన సినీ తార‌లు

  • IndiaGlitz, [Wednesday,February 20 2019]

ఎన్నిక‌ల త‌రుణంలో న‌ల్ల‌ధ‌నం ఎక్కువ‌గా చేతులు మారుతుంటుంది. ఇలాంటి వాటిపై పోలీసులు, అవినీతి నిరోధ‌క శాఖ‌తో పాటు ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్‌లు కూడా ఓ కన్నేసి ఉంచుతారు. ప‌లు స్ట్రింగ్ ఆప‌రేష‌న్‌లు జ‌రుగుతుంటాయి.

అలాంటి ఓ స్ట్రింగ్ ఆప‌రేష‌న్‌లో 36 మంది బాలీవుడ్ తార‌లు వివేక్ ఒబెరాయ్‌, సోనూసూద్‌, జాకీష్రాఫ్‌, కైలాష్ ఖేర్‌, స‌న్నీలియోన్‌, శ‌క్తిక‌పూర్‌, శ్రేయ‌స్ త‌ల్ప‌డే, అమీషా ప‌టేల్‌, పంక‌జ్ ధీర్‌, నికిత‌న్ ధీర్‌, పునీత్ ఇస్సార్, టిస్కా చోప్రా, రాఖీ సావంత్‌, రాజ్‌పాల్ యాద‌వ్ మిన్నిసా లాంబ‌, మ‌హిమా చౌద‌రి, రోహిత్ రాయ్‌, అమ‌న్ వ‌ర్మ‌, కోయినా మిత్ర‌, ద‌లేర్ మెహందీ, మికా, రాహుల్ భ‌ట్‌, రాజు శ్రీవాస్త‌వ‌, విజ‌య్ ఈశ్వ‌ర్‌లాల్ త‌దిత‌రులు కెమెరా కంటికి చిక్కారు.

కోబ్రా పోస్ట్ విలేఖ‌రులు నకిలీ పేర్ల‌తో ప‌లువురు సినీ, టీవీ న‌టులు, గాయ‌కులు, డ్యాన్స‌ర్స్ ను వారి మేనేజ‌ర్స్ ద్వారా క‌లిశారు. వ‌స్తున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల కోసం తాము సూచించిన రాజ‌కీయ పార్టీకి అనుకూలంగా సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌చారం చేయ‌మ‌ని కోరారు. స‌ద‌రు సందేశాల‌ను కూడా తామే అందిస్తామ‌ని వారి వారి సామాజిక మాధ్య‌మాల ఖాతాల్లో పెడితే స‌రిపోతుంద‌ని సూచించారు.

దానికి డ‌మ్మీ కాంట్రాక్ట్ మీద సంత‌కం పెట్ట‌డానికి కూడా వారు సిద్ధ‌మ‌య్యార‌ని కోబ్రాపోస్ట్ పోర్ట‌ల్ సంపాద‌కుడు అనిరుద్ధ బ‌హ‌ల్ చెప్పారు. ఒక్కొక్క సందేశానికి 2 ల‌క్ష‌ల నుండి 50 ల‌క్ష‌ల వ‌ర‌కు చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. రుసుముల్లో ఎక్కువ‌గా భాగం న‌గ‌దు రూపంలో చెల్లిస్తామ‌ని చెప్పినా ఎవ‌రూ కాదన‌లేద‌ట‌. అయితే విద్యాబాల‌న్‌, అర్ష‌ద్ వార్సి, ర‌జా మురాద్‌, సౌమ్య టాండ‌న్ వంటి వారు ఈ ఒప్పందం స‌మ్మ‌తం కాద‌ని సూటిగా చెప్పేశారు.

ఈ వీడియోల్లో కొన్ని మాట‌ల‌ను ఉప‌యోగించుకుని త‌మ‌ను చెడుగా చూపించే ప్ర‌య‌త్నం చేశార‌ని న‌టుడు సోనూసూద్ ఆరోపించారు.

More News

మంచి క‌థ‌, యూనిట్ స‌పోర్ట్ = 'వేర్ ఈజ్ ది వెంక‌ట‌ల‌క్ష్మీ' - నిర్మాత‌లు గుర్నాధ‌రెడ్డి, ఆనంద్ రెడ్డి, శ్రీధ‌ర్ రెడ్డి

గురునాథ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ఎ.బి.టి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాయ్ ల‌క్ష్మీ ప్ర‌ధాన పాత్ర‌లో కిషోర్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.శ్రీధ‌ర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్.కె.రెడ్డి

వ‌స్తాదు పాత్ర‌లో ఐశ్వ‌ర్య రాజేష్‌

లేడీ ఒరియెంటెడ్ సినిమాల‌కు ప్రాధాన్య‌త పెరుగుతుంది. ద‌ర్శ‌కులు అలాంటి క‌థ‌ల‌ను త‌యారు చేస్తుంటే వాటిలో న‌టించ‌డానికి మ‌న హీరోయిన్స్ కూడా ఆస‌క్తి చూపిస్తున్నారు.

న‌య‌న‌తార త‌ర్వాత విక్ర‌మ్‌తో..!

న‌య‌న‌తారతో 'ఇమైక్కా నొడ‌గ‌ల్‌' చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు అజ‌య్ జ్ఞాన‌ముత్తు తొలి చిత్రంతో సూప‌ర్‌హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో 'అంజ‌లి సిబిఐ' పేరుతో విడుద‌ల‌వుతుంది. 

నెగ‌టివ్ షేడ్‌లో నాని....

నేచుర‌ల్ స్టార్ నాని నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడా? అంటే అవున‌నే అంటున్నాయి సినీ వ‌ర్గాలు.

త‌మిళంలో 'అర్జున్ రెడ్డి' టైటిల్ మారింది. 

తెలుగు సెన్సేష‌న‌ల్ హిట్ అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని త‌మిళంలో విక్ర‌మ్ త‌న‌యుడు ధ్రువ్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.