స్నేహం వైరంగా ఎలా మారింది?

  • IndiaGlitz, [Tuesday,August 11 2020]

ఇద్ద‌రు స్నేహితులు విరోధులుగా మారడానికి ప‌రిస్థితులు కార‌ణ‌మ‌వుతుంటాయి. అలాంటి ప‌రిస్థితులు ఇద్ద‌రి ముఖ్య‌మంత్ర‌ల మ‌ధ్య ఉన్న స్నేహాన్ని వైరంగా ఎలా మార్చాయి? అనే పాయింట్‌తో ఓ సినిమా రూపొంద‌నుంద‌ని స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంతులుగా ప‌నిచేసిన నారా చంద్ర‌బాబు నాయుడు, వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి రెండు వేర్వేరు పార్టీల‌కు చెందిన‌వారు. కానీ వీరిద్ద‌రూ ఓకే రాజ‌కీయ పార్టీలో ఒకేసారి త‌మ రాజ‌కీయ ఓన‌మాల‌ను దిద్దారు. అయితే క్ర‌మంగా పార్టీలు, వాటి సిద్ధాంతాలు కార‌ణంగా ఇద్ద‌రు స్నేహితుల మార్గాలు ఎలా మారాయి రాజకీయ వైరం ఎలా ఎలా పెరిగింద‌నే అంశాల‌తో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నార‌ట నిర్మాత‌లు విష్ణు ఇందూరి, తిరుమ‌ల రెడ్డి.

ఈ సినిమాను రెండు భాగాలుగా తీయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. 1980 నుండి 2000 సంవ‌త్స‌రం వ‌ర‌కు ఆంధ్రప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో జ‌రిగిన ప‌రిణామాల‌ను ఆధారంగా చేసుకునే ఈ ఫిక్ష‌న‌ల్ క‌థ‌ను రూపొందిస్తార‌ట‌. మ‌రి ఇందులో ఎవ‌రు న‌టిస్తార‌నే విష‌యాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగ‌క త‌ప్పేలా లేదు. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు, 83 వంటి బ‌యోపిక్ చిత్రాల‌ను నిర్మిస్తున్న విష్ణు ఇందూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

More News

నా ఆలోచ‌న‌ను దొంగ‌లించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు: దేవాక‌ట్ట‌

డైరెక్టర్ దేవాకట్ట ట్విట్టర్ వేదికగా ఓ నిర్మాత‌పై ఆరోప‌ణ‌లు చేశారు. దేవాక‌ట్ట ఎక్క‌డా ఆ నిర్మాత పేరుని ప్ర‌స్తావించ‌క‌పోయినా

ఏపీకి గుడ్‌న్యూస్.. వచ్చే నెలలో కరోనా తగ్గుముఖం: డా. ప్రభాకర్‌రెడ్డి

ఏపీలో కరోనా ఉధృతి తీవ్ర స్థాయిలో ఉంది. ప్రతి రోజూ దాదాపు 10 వేల కేసులు నమోదవుతున్నాయి.

దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు.. 45వేల మందికి పైగా మృతి

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రతి రోజూ 50 వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి.

బాలీవుడ్‌కి ‘వినాయకుడు’.. కృష్ణుడి పాత్రలో..

భారీ బడ్జెట్‌.. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంటాయి. కానీ చిన్న బడ్జెట్‌తో

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు... నేడు ఎన్నంటే..

తెలంగాణలో నిన్నటితో పోలిస్తే నేడు కరోనా కేసులు పెరిగాయి. తాజాగా కరోనా హెల్త్ బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.