జనవరి 6న 'మిస్టర్ మజ్ను' సాంగ్ 'హార్ట్ బ్రేక్'

  • IndiaGlitz, [Saturday,January 05 2019]

అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ‘ఏమైనదో.. ఏమైనదో.. పలుకు మరచినట్టు పెదవికేమైనదో..’, టైటిల్ సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కాగా, ఈ చిత్రంలోని ‘హార్ట్ బ్రేక్’ సాంగ్‌ను జనవరి 6 సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నారు.

అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: థమన్, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: అవినాష్ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి.

More News

బాబాయ్ కోసం ప్ర‌చారం చేస్తా...

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కోసం తాను ప్ర‌చాచం చేయ‌డానికి కూడా సిద్ధంగా ఉన్న‌ట్లు రాంచ‌ర‌ణ్ తెలిపారు.

త్రివిక్రమ్ విడుదల చేసిన వనవాసం పోస్టర్

నవీన్ రాజ్ శంకరాపు , శశి కాంత్, బందెల కరుణ శ్రావ్య, శృతి, హీరో హీరోయిన్లు గా పరిచయం అవుతున్న చిత్రం 'వనవాసం'.

డైరెక్టర్ బాబీ చేతుల మీదుగా 'ధీవర' ఫస్ట్ లుక్ విడుదల

తెలుగులో వైవిధ్యమైన సినిమాల హవా పెరుగుతోంది. కొత్తగా వస్తోన్న దర్శకులే కాదు.. నిర్మాతలు కూడా ఈ తరహా కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

వి.వి.వినాయక్ ఆవిష్కరించిన 'యమ్6' ట్రైలర్

విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ బ్యానర్స్‌పై విశ్వనాధ్ తన్నీరు  నిర్మిస్తున్న చిత్రం ‘యమ్6’.  ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఆవిష్కరించి

నిర్మాత‌ పై రేప్ కేస్‌

మీ టూ ఉద్య‌మం ఉధృతంగా జ‌రుగుతున్న త‌రుణంలో మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపులు త‌గ్గాయ‌ని అంద‌రూ అనుకుంటున్నారు. ఈ సంద‌ర్భంలో మ‌ల‌యాళ నిర్మాత వైశాఖ్ రాజ‌న్‌పై ఎర్నాకులంకు చెందిన ఓ మోడ‌ల్