ధోనీ బాదుడుకు చిన్నబోయిన చిన్నస్వామి!

ఐపీఎల్ మ్యాచ్‌ల్లో మహేంద్ర సింగ్ ధోనీ పెద్దగా రాణించకపోవడంతో ఇక ధోనీ అయిపోయింది.. వయసు మీదికొచ్చింది కదా రిటైర్మెంట్ తీసుకుంటే మంచిది.. ఇదివరకటిలా సిక్సర్లు, ఫోర్లు ధోనీ అస్సలు కొట్టలేకపోతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

అంతేకాదు ధోనీ ఆటతీరుతో ఆయన అభిమానులు, క్రీడాభిమానులు సైతం ఒకింత అసంతృప్తికి లోనయ్యారు. అయితే ఈ విమర్శలకు, అసంతృప్తులకు ఆదివారం నాడు చిన్నస్వామి స్టేడియం వేదికగా ధోనీ సమాధానమిచ్చారు. దీంతో విమర్శకుల చెంప చెళ్లుమనిపించినట్లైంది!.

రికార్డ్ సృష్టించిన ధోనీ..

ఆదివారం రాత్రి రాయల్‌ ఛాలెంజర్స్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. చెన్నై ముందు 162 పరుగుల ఓ మాదిరి లక్ష్యం ఉంది. స్టెయిన్‌, ఉమేశ్‌ నిప్పులు చెరిగే బంతులకు 28 పరుగులకే నాలుగు వికెట్లు ఫట్‌మన్నాయి. దీంతో మ్యాచ్ అయిపోయిందనుకుంటున్న టైమ్‌లో ధోనీ అసమాన ఇన్నింగ్స్‌తో 20వ ఓవర్‌లో 26 పరుగులు అవసరమవగా 4,6,6,2,6తో చిన్నస్వామి స్టేడియాన్ని హోరెత్తించాడు.

అయితే ఆఖరికి మ్యాచ్ మాత్రం తుస్సంది. ఇదిలా ఉంటే ధోనీ ఆటతీరును అందరూ మెచ్చుకుంటున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ధోనీ ఐపీఎల్‌ కెరీర్‌లోనే అత్యుత్తమ స్కోరు (84) నమోదు చేసుకుని అందరి మనసులను గెలుచుకున్నారు. ధోనీ ఇప్పటి వరకూ 203 సిక్స్‌లు పూర్తి చేసుకుని.. కేవలం ఐపీఎల్‌లోనే 200 సిక్స్‌లు దాటిన తొలి భారత ఆటగాడిగా ధోనీ చరిత్ర సృష్టించాడని చెప్పుకోవచ్చు.

ప్రముఖులు ప్రశంసల వర్షం..

ధోనీ ఆటతీరును అందరూ సోషల్ మీడియా వేదికగా మెచ్చుకుంటున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ స్పందిస్తూ భారత జట్టుకు శుభవార్త.. ప్రపంచకప్‌ కోసం ధోని తయారుగా ఉన్నాడు అని కామెంట్ చేశారు. మరో మాజీ క్రికెటర్ సెహ్వాగ్ రియాక్ట్ అవుతూ..వావ్‌.. ఆర్సీబీ, చెన్నై మ్యాచ్‌.. క్రికెట్‌లో ఓ అద్భుతమైన మ్యాచ్‌ అని ఆయన ట్వీట్ చేశారు. ధోనీ ఆటతీరుతో టీమ్ సభ్యులంతా ఒకింత భయపడ్డామని విరాట్ కొహ్లీ చెప్పుకొచ్చాడు.

More News

దేశానికి వైద్యం చేస్తోన్న ఈ ముగ్గురు డాక్ట‌ర్స్ ను అభినందించి, ఆశీర్వ‌దించాలిః 'ఎమ్ బిఎమ్' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో అతిథులు

ప్రత ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై భ‌ర‌త్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ వైద్యులు డా.శ్రీధ‌ర్ రాజు ఎర్ర, డా.తాళ్ల ర‌వి, డా. టి.ప‌ల్ల‌వి రెడ్డి  సంయుక్తంగా తొలిసారిగా నిర్మిస్తోన్న చిత్రం

శ్రీలంక మారణహోమంలో ఇద్దరు జేడీఏస్ నేతలు మృతి

వరుస బాంబు పేలుళ్లతో కొలంబోవాసులు కకావికలమయ్యారు. ఈస్టర్ డే నాడు జరిగిన ఈ మారణహోమంలో సుమారు 300మందికి పైగా మరణించగా..

రాజ్‌త‌రుణ్ కొత్త చిత్రం 'ఇద్ద‌రి లోకం ఒక‌టే' ప్రారంభం

ఎన్నో సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌. ఈ బ్యాన‌ర‌పై యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్స్

గత మూడ్రోజులుగా స్టాక్ మార్కెట్స్‌ నష్టాలతోనే ముగుస్తున్నాయి.!. ఈ నెల మొదట్లో రేసు గుర్రాల్లా పరుగులు తీసిన స్టాక్ మార్కెట్లు ఇప్పుడు చతికిలపడ్డాయి. సోమవారం దేశీయ మార్కెట్స్ నష్టాలతోనే ప్రారంభమయ్యాయి.

'గబ్బర్‌సింగ్' ఆర్టిస్ట్‌ను ఢీ కొన్న కారు..

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన ‘గబ్బర్‌సింగ్‌’లో నటుడు ఆంజనేయులు తన నటనతో అందర్నీ మెప్పించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.