close
Choose your channels

బన్నీ స్థానంలో క్రికెటర్ ధోనీ.. అలీ ఔట్!

Thursday, April 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బన్నీ స్థానంలో క్రికెటర్ ధోనీ.. అలీ ఔట్!

ప్రముఖ బస్ టిక్కెటింగ్ ప్లాట్‌ఫాం ‘రెడ్‌బస్’ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రాచురణ పొందిన ప్లాట్‌ఫాం ఇది. దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ వ్యవహరించిన విషయం విదితమే. బన్నీతో పాటు అలీ, మరో మహిళ కూడా ఈ యాడ్‌లో ఉంటారు. ఈ యాడ్ యూట్యూబ్‌, టీవీల్లో చాలా సార్లు అందరూ చూసే ఉంటారు. అయితే ఇప్పటి వరకూ దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న బన్నీ ఇకపై ప్రకటనలో కనిపించరు. బన్నీతో పాటుగా అలీ కూడా ప్రకటనలో కనిపించరన్న మాట. బన్నీ స్థానంలో ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీని బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకుంటున్నట్లు ‘రెడ్‌బస్’ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇకపై ధోనీ...

తమ బ్రాండ్‌కు సంబంధించిన అన్ని ప్రసార మాధ్యమ ప్రకటనల్లో ధోనీ పాల్గొంటారని, త్వరలోనే ప్రచార చిత్రాలు విడుదల చేస్తామని రెడ్‌బస్‌ సీఈఓ ప్రకాశ్‌ సంగం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రయాణానికి టికెట్‌ బుక్‌ చేసుకునే ప్రక్రియను ఎంతో సౌకర్యవంతం చేసిన రెడ్‌బస్‌తో భాగస్వామ్యం సంతోషం కలిగిస్తోందని ఎంఎస్ ధోనీ అన్నారు. గురువారం నాడు  సింగ్ గెటప్‌‌లో ధోనీ ఉన్న చిత్రాన్ని రెడ్‌బస్ సంస్థ విడుదల చేసింది.

కాగా.. 2006లో ఒక బస్సుతో సంస్థ ప్రారంభించి.. ఇప్పుడు 2,500 మందికి పైగా ఆపరేటర్లతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రెండు కోట్ల మందికి పైగా ప్రయాణికులకు సేవలందిస్తూ, దేశంలోనే అతిపెద్ద, నమ్మకమైన బ్రాండ్‌గా రెడ్‌బస్‌ నిలిచిందని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. కాగా ఇప్పటి వరకూ అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్‌గా మెప్పించారు అయితే ధోనీ ఏ మాత్రం మెప్పిస్తారో వేచి చూడాల్సిందే మరి. అయితే అసలు బన్నీని ఎందుకు పక్కనపెట్టారనే విషయం మాత్రం తెలియరాలేదు. అయితే అలీ, మరో మహిళ స్థానంలో ఎవరు ఉన్నారనే విషయం తెలియాల్సి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.