Mudragada: సినిమాల్లో పవన్ హీరోమో..రాజకీయాల్లో నేనే హీరో.. పవన్‌పై ముద్రగడ సెటైర్లు..

  • IndiaGlitz, [Saturday,March 16 2024]

ఎన్నికలు అయిపోయిన తర్వాత జనసేన పార్టీ క్లోజ్ అవ్వడం ఖాయమని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో చేరిన మరుసటిరోజే పవన్ కల్యాణ్‌ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. తాను వైసీపీలో చేరడం మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ముద్రగడ ఖండించారు. రాబోయే 30 సంవత్సరాలు జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని జోస్యం చెప్పారు.

మీడియాతో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో నాపై తప్పుడు రాతలు రాస్తున్నారు. నేనేమీ కండీషన్లు పెట్టి వైసీపీలో చేరలేదు. ఎలాంటి షరతులు లేకుండానే వైఎస్‌ఆర్‌సీపీలో చేరా. ప్రజలకు సేవ చేయడానికే ఈ పార్టీలో చేరా. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో కావచ్చేమో కానీ.. రాజకీయాల్లో మాత్రం నేనే హీరోని.. మీరా నాకు పాఠాలు చెప్పేంది?. రాజకీయాల్లో మొలతాడు లేనివాడు కూడా నన్ను విమర్శిస్తున్నాడు. మీరు చెప్పినట్లు నేనేందుకు రాజకీయం చేయాలి. నాకు చెప్పడానికి మీరెవరూ అంటూ ప్రశ్నించారు.

జగన్ దగ్గరకు ఎందుకు వెళ్లావు.. పవన్ వద్దకు ఎందుకు వెళ్లలేదంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. జగన్ కుటుంబానికి రాజకీయంగా ఒక చరిత్ర ఉంది. కాపుల, దళితుల కోసం నేను ఉద్యమాలు చేశా.దళితుల భిక్షతోనే ఈ స్థాయికి వచ్చా. నేనేదో ఆశించి వైసీపీలో చేరలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పార్టీలో చేరాను. వైసీపీ వ్యవస్థాపకుల్లో నేనూ ఒకడిని కానీ కొన్ని కారణాల వలన జగన్‌కు దూరమయ్యాయను.. మళ్లీ ఇప్పుడు చేరడం ఆనందంగా ఉంది. అధిష్టానం ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తా. నాకు రాజకీయ భిక్ష పెట్టింది బీసీలు, దళితులు, కాలపులు ఐదుశాతం ఉంటారు. నేను రాజకీయాలకు రావడానికి కాపులు కారణం కాదు. నేను ఎవ్వరి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు కులం కాదు ముఖ్యం.. నాకు వర్గం ముఖ్యం అని తెలిపారు.

మరోవైపు పొత్తులో భాగంగా జనసేనకు 21 సీట్లు కేటాయించడంపైనా సెటైర్లు వేశారు. ఆ 21 సీట్లు కూడా టీడీపీకి తిరిగి ఇచ్చేస్తే మంచిదని సూచించారు. పవన్‍‌ కళ్యాణ్‌ను మారుద్దామని ఎంతగా ప్రయత్నించినా కుదరలేదని.. తక్కువ సీట్లలోనే పోటీకి పరిమితం కావటంతో పవన్ కళ్యాణ్ బలమెంతో ప్రజలకు అర్థమైపోయిందంటూ విమర్శలు చేశారు.

More News

Kejriwal: లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు

ఢిల్లీ లిక్కర్ కేసులో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది.

Dhanam Nagender:దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలి.. స్పీకర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు..

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదుచేశారు.

Modi:కవిత అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ నేతలు కమీషన్లు తీసుకున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా జగిత్యాల విజయసంకల్ప సభలో ఆయన ప్రసంగించారు.

Prajagalam:కూటమి 'ప్రజాగళం' సభ అట్టర్ ఫ్లాప్.. వైసీపీ నేతల విమర్శలు..

టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి చిలలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Kavitha:సుప్రీంకోర్టులో కవిత పిటిషన్.. అక్రమంగా అరెస్ట్ చేశారని ఫిర్యాదు..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.