ఆయన తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.. ఆ స్థానంలోకి ఎవరొస్తారు?

  • IndiaGlitz, [Tuesday,July 14 2020]

ఏపీలో చెప్పుకోదగిన ఉద్యమాల్లో ఒకటి కాపు ఉద్యమం. తుని ఘటన రాష్ట్ర చరిత్రలోనే మరిచిపోలేనిది. ఇంతకాలం దీనికి రథసారధిగా ఉండి నడిపించిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆ ఉద్యమం నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా వేదికగా తనను కొందరు టార్గెట్ చేస్తున్నారని.. మానసికంగా కృంగి పోయేలా చేస్తున్నారని ఆయన వాపోయారు. ఆ విధంగా తనపై ఎందుకు దాడులు చేయిస్తున్నారో అర్థం కాలేదని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఉద్యమంలోకి రావడానికి ముఖ్య కారణం చంద్రబాబేనన్నారు. అయితే ఈ ఉద్యమం ద్వారా డబ్బు కానీ, పదవులు కానీ పొందాలని తానేనాడూ అనుకోలేదన్నారు. ఉద్యమంలోకి వచ్చాక.. ఆర్థికంగా, ఆరోగ్యపరంగానే కాకుండా రాజకీయంగా కూడా తానెంతో నష్టపోయానని ముద్రగడ వెల్లడించారు.    

ఇప్పుడు ముద్రగడను టార్గెట్ చేస్తున్నదెవరు?

ముద్రగడ ఇంతలా ఆవేదన చెందడానికి కారణం ఎవరు? ఆయనను ఎందుకింతలా ఇబ్బంది పెడుతున్నారనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. చర్చా వేదికల్లో మాత్రం తనను దారుణంగా దూషిస్తున్నారని వెల్లడిచారు. మరి ఆయనను ఇబ్బంది పెట్టడం వెనుక ఎవరికి లాభం చేకూరుతుందనేది మాత్రం తెలియడం లేదు. కాపు సామాజిక వర్గానికి సారధిగా ఉన్న ఆయన.. ఒక కాపు అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వస్తే.. ఏమాత్రం సహకరించలేదని ఆరోపణలు వినవచ్చాయి. అసలు పవన్ కల్యాణ్.. ముద్రగడ కారణంగానే ఓడిపోయారనే టాక్ కూడా ఉంది. దీంతో అప్పట్లో పవన్ ఫ్యాన్స్ ఆయనను బాగా టార్గెట్ చేశారు. కనీసం తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పోటీ చేస్తే సహాయ సహకారాలు అందించలేదని కాపు వర్గానికి చెందిన వారు సైతం ఆగ్రహంతో ఉన్నారు. అయితే తాజాగా ఆయనను టార్గెట్ చేస్తున్న వారెవరనేది మాత్రం తెలియలేదు.

ముద్రగడ స్థానంలోకి ఎవరొస్తారు?

ముద్రగడ మాటలను బట్టి చూస్తే మాత్రం కాపు ఉద్యమాన్ని అణచాలని ఎవరో అనుకుంటున్నట్టు మాత్రం తెలుస్తోంది. ఎవరనుకుంటున్నారు? ఆ అవసరం ఎందుకొచ్చింది? అనేది మాత్రం తెలియడం లేదు. అయితే ప్రస్తుతం ముద్రగడ తప్పుడకుంటే ఆయన ప్లేస్‌లోకి ఎవరొస్తారు? అనేది కూడా తెలియడం లేదు. ముద్రగడ కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటాననే ప్రకటనపై కాపు నేతలు, ఆయన అభిమానులు, అనుచరులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఆయన స్థానంలోకి మరో బలమైన నేతను తీసుకు వస్తారా? లేదంటే బుజ్జగించి ఆయననే కొనసాగిస్తారా? అనేది మాత్రం వేచి చూడాలి.

More News

తెలంగాణలో నిన్న మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు

తెలంగాణలో సోమవారం మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. అంతకు ముందు మూడు రోజులు కరోనా పాజిటివ్ కేసులు 1200 లోపు మాత్రమే నమోదయ్యాయి.

విశాఖ సాల్వెంట్స్ సంస్థలో భారీ అగ్ని ప్రమాదం.. భారీ పేలుళ్లు..

విశాఖ ప్రమాదాలకు పుట్టినిల్లుగా మారుతోందేమో అనిపిస్తోంది.. ఈ మధ్య జరుగుతున్న వరుస ఘటనలను చూస్తే..

ప‌వ‌న్ భ‌క్తుడి పాత్ర‌లో ఆర్జీవీ?

ప‌వ‌ర్‌స్టార్‌,జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు భారీ అభిమాన గ‌ణం సొంతం. జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా ఆయ‌నకు అభిమానులుంటడ‌మే ఆయ‌న క్రేజ్‌కు నిద‌ర్శ‌నం.

25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గుణశేఖర్ ఉత్తమ చిత్రం 'సొగసు చూడతరమా'

'రుద్రమదేవి'తో దర్శకనిర్మాతగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుని ప్రస్తుతం ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం 'హిరణ్యకశ్యప' ప్రారంభిస్తున్న డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్

బ‌న్నీని ఒక ఛాన్స్ ఇవ్వ‌మ‌న్న బాలీవుడ్ డైరెక్ట‌ర్‌

టాలీవుడ్ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో కలెక్షన్స్ పరంగా ‘బాహుబలి’ రికార్డులను సినిమా క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.