close
Choose your channels

షాకింగ్ ట్విస్ట్ : వైసీపీ తరఫున రాజ్యసభకు ముద్రగడ!?

Thursday, June 6, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

షాకింగ్ ట్విస్ట్ : వైసీపీ తరఫున రాజ్యసభకు ముద్రగడ!?

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీ తరఫున రాజ్యసభకు వెళ్తారా..? వైసీపీ నుంచి ముద్రగడకు ఆహ్వానం అందిందా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించి రాజ్యసభతో పాటు మరో కీలక పదవి కూడా ఇవ్వడానికి జగన్ సిద్ధమయ్యారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది.

2014 సీన్ 2019లో రివర్స్ అయ్యింది!

ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఫర్లేదు మా కాపు జాతికి రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందేనని ఏళ్ల తరబడి ముద్రగడ పద్మనాభం ఉద్యమిస్తూనే ఉన్నారు. 2014లో టీడీపీ అధినేత చంద్రబాబు.. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేస్తామనడంతో ఉభయ గోదావరి జిల్లా్ల్లో గంపగుత్తుగా సైకిల్ గుర్తుపై గుద్దేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మాట తప్పడంతో మళ్లీ ఉద్యమాలు, తుని ఘటన లాంటి విధ్వంసాలు జరిగాయి. 2019 ఎన్నికల్లో కాపు రిజర్వేషన్లకు తనవంతుగా ప్రయత్నాలు చేస్తానని.. అంతేకాకుండా కార్పొరేషన్‌కు పెద్ద ఎత్తున నిధులు ఇస్తానని వైఎస్ జగన్ హామీ ఇవ్వడంతో 2014 సీన్ మొత్తం రివర్స్ అయ్యి.. ఈ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఆశించిన సీట్ల కంటే ఎక్కువగానే వైసీపీ ఖాతాల్లో పడ్డాయి.

వైసీపీ గెలుపులో పరోక్ష పాత్ర!

అయితే కాపులు.. వైసీపీ వైపు మొగ్గడం వెనుక జగన్ హామీలు 60% మంది కాపులు నమ్మగా.. మిగతా 40 % మంది కాపులను వైసీపీకే ఓట్లేశేలా అన్ని విధాలా దగ్గరుండి ముద్రగడ చూసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే అటు టీడీపీకి గానీ.. ఇటు జనసేనకు గానీ మద్దతివ్వకుండా.. పరోక్షంగా జగన్‌కు కూడా మద్దతివ్వకుండా లోలోపలనే వ్యవహారం నడిపారని వార్తలు వస్తున్నాయి. సొంత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి పవన్ కల్యాణ్ తన మద్దతు కోరినప్పటికీ ముద్రగడ మాత్రం సపోర్ట్ చేయలేదు.. అంతేకాదు టీడీపీని సైతం ఆయన అస్సలు పట్టించుకోలేదు.

రాజ్యసభా.. కార్పొరేషనా..!?

పార్టీ కోసం ఇంత చేసిన ముద్రగడకు వైసీపీలో చేరాలంటూ జగన్ ఆహ్వానించారట. అయితే ఇంతవరకూ ముద్రగడ నుంచి రెస్పాన్స్ రాలేదు. జగన్ ఆహ్వానాన్ని మన్నించి ముద్రగడ వైసీపీలో చేరితే... ఆయనకు వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా పంపేందుకు కూడా జగన్ సిద్ధంగానే ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ ముద్రగడకు రాజ్యసభకు వెళ్లేందుుక ఇష్టం లేకపోతే ‘కాపు కార్పొరేషన్ చైర్మెన్’ పదవి కట్టబెట్టాలని జగన్ భావిస్తున్నారట. అంటే ముద్రగడకు జగన్ రెండు బంపర్ ఆఫర్లు ఇచ్చారన్న మాట. రాజకీయాల్లో ఉండగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే. అయితే.. వైసీపీ ఆఫర్లకు ఆకర్షితుడై ముద్రగడ ఆ పార్టీలో చేరతారా..? లేకుంటే ఎలాంటి పదవి లేకుండానే రిజర్వేషన్ల కోసం మళ్లీ ఉద్యమిస్తారా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.