నాగచైతన్య సినిమాకు ముహుర్తం ఫిక్స్ అయ్యింది....

  • IndiaGlitz, [Monday,September 12 2016]

కింగ్ నాగార్జున పెద్ద త‌న‌యుడు అక్కినేని నాగ‌చైత‌న్య ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ప్రేమ‌మ్‌, సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమాల‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాడు. కాగా త‌దుప‌రిగా నాని, సోగ్గాడే చిన్ని నాయనా ఫేమ్ క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని నాగార్జున స్వ‌యంగా ప్ర‌క‌టించాడు. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా న‌వంబ‌ర్ 4 నుండి లాంచ‌నంగా ప్రారంభం కానుంద‌ట‌. నిన్నే పెళ్ళాడ‌తా త‌ర‌హాలో ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా ఉంటుంద‌ట‌.

More News

గోపీచంద్ టైటిల్ గురించి....

డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ లో నటిస్తూ తనకంటూ మాస్ హీరోగా ప్రత్యేకతను సంపాదించుకున్న గోపీచంద్ హీరోగా

'సిద్ధార్ధ' టీమ్ ను విష్ చేసిన మోహన్ లాల్

మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్కు, తెలుగు సినిమాకు మంచి అనుబంధం ఉంది. ఇటీవల ఆయన నటించిన రెండు తెలుగు చిత్రాలు విడుదలయ్యాయి.

చిరు మూవీ సీక్వెల్ లో చ‌ర‌ణ్..!

మెగాస్టార్ చిరంజీవి - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం జ‌గ‌దేక‌వీరుడు - అతిలోక‌సుంద‌రి. ఈ సంచ‌ల‌న చిత్రాన్ని వైజ‌యంతి మూవీస్ బ్యానర్ పై అశ్వ‌నీద‌త్ నిర్మించారు. ఇప్పుడు అశ్వ‌నీద‌త్ ఈ చిత్రానికి సీక్వెల్ తీయాల‌నుకుంటున్నారు.

70 కోట్ల క్ల‌బ్ లో జ‌న‌తా గ్యారేజ్..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన జ‌న‌తా గ్యారేజ్ చిత్రం ఈనెల 1న రిలీజై రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ తో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది.

అభినేత్రి ట్రైల‌ర్ రిలీజ్..!

త‌మ‌న్నా, ప్ర‌భుదేవా, సోనూసూద్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో విజ‌య్ తెర‌కెక్కించిన చిత్రం అభినేత్రి. ఈ చిత్రాన్ని త‌మిళ్ లో ప్ర‌భుదేవా నిర్మిస్తుంటే, హిందీలో సోనూసూద్ నిర్మిస్తున్నారు.