ఎన్టీఆర్ - పూరి మూవీ ఎనౌన్స్ మెంట్ ముహుర్తం ఫిక్స్

  • IndiaGlitz, [Thursday,October 13 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో ఆంధ్రావాలా, టెంప‌ర్ చిత్రాలు రూపొందిన విష‌యం తెలిసిందే. అయితే... వీరిద్ద‌రూ క‌లిసి మూడవ సినిమా త్వ‌ర‌లో చేయ‌నున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అంతే కాకుండా ఎన్టీఆర్ కి పూరి క‌థ చెప్ప‌డం...క‌థ విని ఎన్టీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం జ‌రిగిపోయింది అని కూడా వార్త‌లు వ‌చ్చాయి.

ఇదిలా ఉంటే...జ‌న‌తా గ్యారేజ్ తో బ్లాక్ బ‌ష్ట‌ర్ సాధించిన ఎన్టీఆర్ త‌న రేంజ్ మ‌రింత పెంచే డైరెక్ట‌ర్ కోసం చూస్తున్నాడు. అందుచేత‌నే పూరి విష‌యంలో నిర్ణ‌యం తీసుకోలేక‌పోతున్నాడు అంటూ మ‌రో వార్త తెర‌పైకి వ‌చ్చింది. అయితే...ఎన్టీఆర్ రేంజ్ కి త‌గ్గ సినిమా తీయ‌డానికి...అది కూడా త‌క్కువ టైమ్ లో తీయ‌గ‌ల డైరెక్ట‌ర్ అంటే పూరి త‌ప్ప వేరే డైరెక్ట‌ర్ ఎవ‌రూ క‌న‌ప‌డ‌డం లేదు. అందుచేత ఎన్టీఆర్ త‌దుప‌రి చిత్రాన్ని పూరితో చేయ‌డానికి ఫిక్స్ అయిన‌ట్టు స‌మాచారం. అయితే...ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు అంటే...మాకు అందిన స‌మాచారం ప్ర‌కారం... ఎన్టీఆర్ - పూరి కాంబినేష‌న్లో రూపొందే భారీ చిత్రాన్ని ఇజం స‌క్సెస్ మీట్ లో ఎనౌన్స్ చేయాలి అనుకుంటున్నార‌ట‌. మ‌రి.. ఇది నిజ‌మో కాదో తెలియాలంటే ఇజం స‌క్సెస్ మీట్ వర‌కు ఆగాల్సిందే..!

More News

అఖిల్ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

అక్కినేని అఖిల్ త‌న‌ రెండో సినిమాను మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న‌ట్టు నాగార్జున ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే.

క్లారిటి ఇచ్చేసిన‌ శృతిహాస‌న్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ కాట‌మ‌రాయుడు. ఇటీవ‌ల ప్రారంభం అయిన ఈ చిత్రం ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.

రానా న్యూమూవీ టైటిల్ ఇదే..!

ద‌గ్గుబాటి రానా ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు ఘాజీ చిత్రంలో కూడా న‌టిస్తున్నారు. ఈ రెండు చిత్రాల త‌ర్వాత రానా - తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో రానా స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంది.

'కోటికొక్కడు' ఆడియో విడుదల

సి.ఎల్.ఎన్.మీడియా, లగడపాటి శ్రీనివాస్, గూడూరి గోపాల్శెట్టి అందిస్తున్న చిత్రం 'కోటికొక్కడు'. తమిళం, కన్నడంలో విడుదలైన ఈ చిత్రం కోట్లకు పైగా భారీ వసూళ్లను సంపాదించింది.

సెన్సార్ పూర్తి చేసుకున్న చిలుకూరి బాలాజీ

అల్లాణి శ్రీధర్ స్వీయదర్శకత్వంలో ఈటివి సౌజన్యంలో ఫిల్మీడియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన చిలుకూరి బాలీజీ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ కారు సినిమాకు యు సర్టిఫికెట్ ఇచ్చారు.