ముంబాయి కంపెనీతో చేతులు క‌లిపిన రానా..!

  • IndiaGlitz, [Monday,October 10 2016]

బాహుబ‌లి సినిమాతో రానా ఇమేజే మారిపోయింది. ఒక్క‌సారిగా జాతీయ స్ధాయిలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఓ వైపు బాహుబ‌లి 2 సినిమా చేస్తునే మ‌రో వైపు ఘాజీ అనే భారీ చిత్రంలో న‌టిస్తున్నారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... అడ్వ‌ర్ టైజ్ మెంట్స్, బ్రాండ్స్, మీడియా కార్పోరేష‌న్స్, మార్కెటింగ్ సొల్యూష‌న్స్ ఇలా స్టార్స్ కు సంబంధించిన‌ ప్ర‌మోష‌న్స్ అన్నింటిని చూసుకునే ముంబాయి కంపెనీ క్వాన్. ఈ సంస్థ‌తో రానా చేతులు క‌లిపాడు. ఈ సంస్థ కేవ‌లం సినిమా స్టార్స్ ప్ర‌మోష‌న్స్ మాత్ర‌మే కాకుండా స్పోర్ట్స్, మ్యూజిక్ త‌దిత‌ర రంగాల‌కు సంబంధించిన ప్ర‌మోష‌న్స్ ను కూడా చేస్తుంటుంది. టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మార్కెటింగ్ వ్య‌వ‌హ‌రాల‌ను ఈ సంస్థే చూస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీతో క‌లిసి రానా హైద‌రాబాద్ లో ఈ సంస్థ‌ను ఏర్పాటు చేస్తుండ‌డం విశేషం.

More News

శ్రీనివాస్ రెడ్డి టైం స్టార్ట్ అయ్యింది

ఇండస్ట్రీ లో త‌న‌కంటూ  ప్రత్యేకమైన స్పేస్ ని సంపాదించుకున్న శ్రీనివాస రెడ్డి గీతాంజలి తర్వాత మరో పాత్రతో అలరించేందుకు రెడీ అయ్యాడు. జయమ్ము నిశ్చయమ్మురా.. లో  మరోసారి తనలోని నటుడ్ని పరిచయం చేసాడు.

సునీల్ నెక్ట్స్ మూవీకి డిఫ‌రెంట్ టైటిల్..!

క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్ న‌టించిన తాజా చిత్రం ఈడు గోల్డ్ ఎహే. వీరు పోట్ల తెర‌కెక్కించిన ఈడు గోల్డ్ ఎహే చిత్రం ద‌స‌రా కానుక‌గా రిలీజై స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతుంది.

నవంబర్ 11న 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం

అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్ చిత్రాలు హిలేరియస్ కామెడీతో అందర్నీ ఎంటర్టైన్ చేశాయి.

ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టునే డిఫ‌రెంట్ హ‌ర్ర‌ర్ కామెడీ ఫిల్మ్ నేను సీతాదేవి - హీరో సందీప్

యువ క‌థానాయ‌కుడు సందీప్ న‌టిస్తున్న సినిమా నేను సీతాదేవి. కోమ‌లి, భ‌వ్య‌శ్రీ క‌ధానాయిక‌లుగా న‌టిస్తున్నారు. సందీప్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రూపొందిన ఈ చిత్రంలో ర‌ణధీర్, వెన్నెల కిషోర్, జీవా, ధ‌న్ రాజ్, గుండు హ‌నుమంత‌రావు త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌లు పోషించారు.

సప్తగిరి ఎక్స్ ప్రెస్ రెడీ - డా.రవి కిరణ్

కమెడియన్ గా కడుపుబ్బా నవ్విస్తున్న స్టార్ కమెడియన్ సప్తగిరి ఇప్పుడు హీరోగానూ అలరించేందుకు సిద్ధమయ్యాడు. సప్తగిరి ఎక్స్ ప్రెస్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పవార్ దర్శకత్వం వహిస్తున్నాడు.