close
Choose your channels

ముంబాయిలో స‌ర్ధార్ ఆడియో 

Wednesday, March 23, 2016 • తెలుగు Comments

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా రిలీజ్ అవుతుంది. బాలీవుడ్ లో 800 ధియేట‌ర్స్ లో స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ రిలీజ్ అవుతుండ‌డం విశేషం. యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని అందించిన స‌ర్ధార్ గబ్బ‌ర్ సింగ్ ఆడియో రిలీజ్ అయ్యింది.

ఇప్పుడు బాలీవుడ్ లో స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ తెలియ‌చేసారు. ప్ర‌స్తుతం దేవిశ్రీప్ర‌సాద్ ముంబాయిలో ఉన్నారు. హిందీ లిరిక్స్ తో త‌న మ్యూజిక్ ని మిక్స్ చేసి మ్యాజిక్ చేయ‌డానికి చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నారని శ‌ర‌త్ మ‌రార్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 8న రిలీజ్ చేస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz