బన్నీ కోసం ముంబై టీమ్

  • IndiaGlitz, [Thursday,February 20 2020]

అల్లు అర్జున్ బిరుదు స్టైలిష్ స్టార్.. ప్రతి సినిమా లుక్ పరంగా బన్నీ చాలా కేర్ తీసుకుంటూ ఉంటాడు. ఇటీవ‌ల విడుద‌లైన 'అల వైకుంఠ‌పుర‌ములో'లో బ‌న్నీ సరికొత్త లుక్‌లో క‌న‌ప‌డి ఆకట్టుకున్న సంగ‌తి తెలిసిందే. బ‌న్నీ ఇప్పుడు త‌న 20వ సినిమా కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ సినిమాను వెర్సటైల్ డైరెక్ట‌ర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తుండ‌గా.. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది. త్వ‌ర‌లోనే సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. బ‌న్నీ ఈ సినిమా కోసం ర‌గ్డ్ లుక్‌లో క‌న‌ప‌డుతున్నాడు. గ‌డ్డం కూడా పెంచేశాడు. అభిమానుల‌ను, ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా క‌న‌ప‌డ‌టానికి ముంబై నుండి టీమ్ రాబోతున్నారు. బ‌న్నీపై స్పెష‌ల్ ఫొటో షూట్‌ను నిర్వ‌హించి లుక్‌ను ఖ‌రారు చేయ‌బోతున్నార‌ట‌.

ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. ఈ చిత్రానికి శేషాచ‌లం అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న హృరోయిన్‌గా న‌టించ‌నుంది. అనసూయ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నుంది. ఆర్య‌, ఆర్య 2 చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, సుకుమార్ కాంబినేష‌న్‌లో రాబోతున్న సినిమానే కాదు.. రంగ‌స్థ‌లం వంటి భారీ హిట్ త‌ర్వాత సుకుమార్ తెర‌కెక్కించ‌బోతున్న చిత్రం కూడా ఇదే కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

More News

ఈ షూటింగ్ స్పాట్ యమా డేంజర్!?

ఈవీపీ స్టూడియో చెన్నైలో బాగా ఫేమస్.. కోలీవుడ్‌కు సంబంధించిన పెద్ద పెద్ద సినిమాల షూటింగ్‌లు ఇక్కడ ఎక్కువగా జరుగుతుంటాయ్.

‘భీష్మ’ వినోదాత్మకంగా సాగుతుంది  - దర్శకుడు వెంకీ కుడుముల

నితిన్‌, రష్మిక మందన్నా జంటగా వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై

బాధిత కుటుంబాల‌కు క‌మ‌ల్ ఆర్థిక సాయం

క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `ఇండియ‌న్ 2`.

సైనిక్ బోర్డుకు కోటి విరాళమిచ్చిన తొలి భారతీయుడిగా పవన్!

దేశమంటే మట్టి కాదోయ్..దేశమంటే మనుషులోయ్! మన దేశంలో ఉన్న ప్రజలను కాపాడేందుకు మట్టిలో సైతం కలిసేందుకు సిద్ధమయ్యేవాడు ఒక్క సైనికుడే!

పోర్న్ కెరీర్‌ ఎంచుకున్న డైరెక్టర్ కుమార్తె.. ఆర్జీవీ కామెంట్ ఇదీ

అవును మీరు వింటున్నది నిజమే.. ఓ ప్రముఖ డైరెక్టర్ కుమార్తె పోర్న్ కెరీర్‌ను ఎంచుకుంది. అంతేకాదండోయ్..