మహేష్ విలన్ అవుతున్న దర్శకుడు...

  • IndiaGlitz, [Tuesday,March 22 2016]

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బ్రహ్మోత్సవం చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఎ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళం, హిందీలో భాషల్లో 100 కోట్ల బడ్జెట్ లో సినిమాను తెరకెక్కనున్న చిత్రంలో నటించబోతున్నాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14ను ప్రారంభిస్తారనే వార్తలు వినపడ్డాయి. అయితే బ్రహ్మోత్సవం చిత్రీకరణ ఆలస్యమవడంతో సినిమాను జూన్ లో ప్రారంభిస్తారని సమాచారం. అలాగే చిత్రంలో ఓ దర్శకుడుని విలన్ గా నటింప చేయడానికి మురగదాస్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ దర్శకుడు గతంలో మహేష్ ను డైరెక్ట్ చేశాడని సమాచారం. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియదు కానీ ఈ వార్త మాత్రం ఓ రకంగా హల్ చల్ చేస్తుంది.

More News

శంకర్ ఫిదా అయిపోయాడు..

సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్, అక్షయ్ కుమార్, ఎమీజాక్సన్ కాంబినేషన్ లో ప్రస్తుతం 2.0 సీక్వెల్ ఆఫ్ రోబో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

చిరు సరసన అనుష్క..?

మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాతో సినీ రంగంలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో కత్తి సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

'24'రిలీజ్ వాయిదా పడనుందా?

తమిళ హీరో సూర్య ప్రస్తుతం హీరోగా నటిస్తూ నిర్మాతగా మారి 2డి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రూపొందిస్తున్న చిత్రం 24.

నా లైఫ్ ఛేంజ్ చేసిన‌ సినిమాలు ఇవే అంటున్న త‌మ‌న్నా..

తెలుగు, త‌మిళ్, హిందీ చిత్రాల్లో న‌టిస్తూ...ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా. ప్ర‌స్తుతం త‌మ‌న్నా తెలుగు, త‌మిళ్ లో రూపొందిన ఊపిరి చిత్రంలో న‌టించింది.