డబుల్ ధ‌మాకా ఇవ్వ‌నున్న మ్యూజిక్ డైరెక్టర్

  • IndiaGlitz, [Sunday,June 03 2018]

‘అర్జున్ రెడ్డి’.. సంచలనానికి మారు పేరుగా నిలిచిన సినిమా. ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమకి సందీప్ రెడ్డి అనే కొత్త దర్శకుడిని, అలాగే హీరోయిన్‌ షాలిని పాండేను పరిచయం చేసింది. అంతేకాకుండా.. వీరితో పాటు హర్షవర్థన్ రామేశ్వర్ అనే కొత్త సంగీత దర్శకుడిని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. హర్షవర్థన్ నేపథ్య సంగీతం అందించిన తొలి సినిమా విజయం సాధించడంతో.. సంగీత దర్శకుడిగా మరో రెండు సినిమాల్లో అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆ రెండూ కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ఆ వివరాల్లోకి వెళితే.. బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంట‌గా నటించిన సినిమా ‘సాక్ష్యం’. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ఇది జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇదే నెలలో తాను సంగీతం అందించిన మరో సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అదే మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న సినిమా ‘విజేత’. మాళవికా నాయర్ నాయికగా నటించిన ఈ సినిమాకి రాకేశ్ శశి దర్శకత్వం వహించారు. ఈ రెండు సినిమాల‌తో వ‌చ్చే నెల‌లో డబుల్ ధ‌మాకా ఇవ్వ‌నున్నారు ఈ మ్యూజిక్ డైరెక్టర్.

More News

'తేజ్‌ ఐ లవ్‌ యు' ఫస్ట్‌ సాంగ్‌ లాంచ్‌

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో

కోల్‌క‌త్తాలో '2 స్టేట్స్' సెకండ్ షెడ్యూల్ పూర్తి

లక్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌ , ప్రొడక్షన్స్ no.1 గా  రూపొందిస్తున్న చిత్రం '2 స్టేట్స్‌' (వర్కింగ్ టైటిల్ ). చేత‌న్ భ‌గ‌త్ రాసిన న‌వ‌ల '2 స్టేట్స్‌' ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా

తెలుగు మూవీ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ యూనియ‌న్ సిల్వ‌ర్‌ జూబ్లి వేడుక‌ల‌కి ముఖ్యఅతిథిగా సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు

తెలుగు సినిమా 24 క్రాఫ్ట్స్ లో ముఖ్య‌మైన విభాగాల్లో తెలుగు మూవీ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ యూనియ‌న్ ఒక‌టి..

నిఖిల్ 'ముద్ర' ఫస్ట్ లుక్ కు మంచి స్పందన

యువహీరో తాజాగా నటిస్తోన్న సినిమా ‘ముద్ర’. ‘ఠాగూర్’ మధు సమర్పిస్తున్న ఈ సినిమాను ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్,

శ్రీనివాస‌రెడ్డి అలా అడిగేశాడా?

`గీతాంజ‌లి`, `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా` సినిమాల‌తో హీరోగా నిల‌దొక్కుకునే ప్ర‌య‌త్నం చేశారు శ్రీనివాస‌రెడ్డి.