అంజలి టైటిల్ పాత్ర‌లో కోన పిలిమ్ కార్పొరేష‌న్‌, ఎం.వి.వి. సినిమా కాంబినేష‌న్‌లో 'గీతాంజ‌లి 2'

  • IndiaGlitz, [Sunday,June 17 2018]

ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి. సినిమా బ్యాన‌ర్‌పై రూపొందిన హార‌ర్ కామెడీ చిత్రం 'గీతాంజ‌లి'.. సెన్సేష‌న‌ల్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. కోన వెంక‌ట్‌, ఎం.వి.వి.సినిమా హార‌ర్ కామెడీ జోన‌ర్‌లో 'గీతాంజ‌లి'తో స‌క్సెస్ సాధించ‌డ‌మే కాదు.. స‌రికొత్త ట్రెండ్ క్రియేట్ చేయ‌డమే కాక.. విజ‌య‌వంత‌మైన ప‌లు హార‌ర్ కామెడీ చిత్రాల‌కు నాంది ప‌లికారు. అలాగే కోన వెంకట్ స్థాపించిన నిర్మాణ సంస్థ కోన పిలిమ్ కార్పొరేష‌న్‌(KFC) బ్యాన‌ర్‌లో వ‌చ్చిన అభినేత్రి, నిన్ను కోరి చిత్రాలతో విజయాలు సాధించింది. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ సాదించే దిశ‌గా అడుగులు వేస్తుంది. ఇలా రెండు విజ‌య‌వంత‌మైన సంస్థ‌లు కల‌యిక‌లో ఆది పినిశెట్టి, తాప్సీ, రితిక‌సింగ్ ప్ర‌ధాన తారాగ‌ణంగా 'నీవెవ‌రో' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం విడుదల కు సిద్దమవుతుంది.

వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో సినిమాలు చేస్తున్న ఈ రెండు నిర్మాణ సంస్థ‌లు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మ‌రో చిత్రం 'గీతాంజ‌లి 2'. ప్రముఖ న‌టి అంజ‌లి టైటిల్ రోల్‌లో న‌టిస్తున్నారు. స్టార్ డాన్స్ మాస్ట‌ర్‌, హీరో, డైరెక్ట‌ర్ ఇలా అన్ని విభాగాల్లో త‌న‌దైన ప్ర‌తిభను నిరూపించుకున్న ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్ ప్ర‌భుదేవా ఈ సినిమా వివ‌రాల‌ను త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసి యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. త్వరలో మొదలు కానున్న ఈ చిత్రానికి భారతీయ సంతతి కి చెందిన ఒక అమెరికన్ దర్శకత్వం వహించనున్నారు.

ఈ చిత్రం థ్రిల్ల‌ర్ కామెడీ జోన‌ర్‌లో రూపొంద‌నుంది. త్వర‌లోనే మ‌రిన్ని వివరాలను త్వరలోనే తెలియ చేస్తామని చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోనవెంకట్ తెలిపారు.

More News

దిల్ రాజు చేతుల మీదుగా శంభో శంకర 3వ పాట విడుదల

శంక‌ర్ ని హీరోగా,  శ్రీధ‌ర్ ఎన్. ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో

రెండు పేర్ల‌తో ఎన్టీఆర్‌

ఈ విజ‌య‌ద‌శ‌మికి అర‌వింద స‌మేత వీర రాఘ‌వ అంటూ అభిమానుల ముందుకు రాబోతున్నారు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తార‌క్ న‌టిస్తున్న తొలి చిత్ర‌మిది.

చిరుతో ముచ్చ‌ట‌గా మూడోసారి

మెగాస్టార్ చిరంజీవి దాదాపు ప‌దేళ్ళ గ్యాప్ త‌రువాత హీరోగా న‌టించిన చిత్రం ఖైదీ నంబ‌ర్ 150. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం గ‌తేడాది సంక్రాంతికి విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

షూటింగ్ పూర్తి చేసుకున్న మల్టీస్టారర్ చిత్రం 'వీర భోగ వసంత రాయలు'

నారా రోహిత్‌, శ్రీయా శర‌ణ్‌, సుధీర్ బాబు, శ్రీవిష్ణు కాంబినేష‌న్ లో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం వీర భోగ వసంత రాయలు.

రాజ్‌త‌రుణ్ 'ల‌వ‌ర్' షూటింగ్ పూర్తి.

తొలి చిత్రం 'ఊయ్యాల జంపాల‌' తో స‌క్సెస్‌ఫుల్ హీరోగా కెరీర్‌ను స్టార్ట్‌చేసిన యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్.