close
Choose your channels

నా భర్త ఏ తప్పూ చేయలేదు.. పారిపోవాల్సిన ఖర్మేంటి!?

Monday, October 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నా భర్త ఏ తప్పూ చేయలేదు.. పారిపోవాల్సిన ఖర్మేంటి!?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం కర్నూలు జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కుటుంబం ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే సేవ్ ఆళ్లగడ్డ అంటూ యురేనియం తవ్వకాలను ఆపడమే కాకుండా.. ప్రజల పక్షాన నిలబడతామని బల్ల గుద్దీ మరిచెబుతున్నారు అఖిల. ఇక అసలు విషయానికొస్తే.. మాజీ మంత్రి భర్తపై ఇప్పటికే పలు కేసులు ఉండగా.. ఇటీవల పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ తతంగం అంతా కర్నూలు జిల్లా అంటే ఏపీలో జరగ్గా.. భూమా ఫ్యామిలీ హైదరాబాద్‌లో ఉండగా ఇక్కడికి ఆ కేసులన్నీ తరుముకొస్తున్నాయి. అక్కడి పోలీసులు హైదరాబాద్‌కు వచ్చి మరీ కేసు విషయంలో అఖిల భర్తను అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై తాజాగా ఓ ఇంటర్వ్యూ వేదికగా భూమ అఖిల కాసింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

తన భర్తపై తప్పుడు కేసులు పెడుతున్నారని, పరారీలో ఉండాల్సిన అవసరం ఆయనకు లేదని.. మేం ఫ్యాక్షన్ కేసులకే భయపడలేదని, ఇలాంటి కేసులకు భయపడతామా? అంటూ అఖిల వ్యాఖ్యానించారు. భూమా కుటుంబం పరువు తీయడానికే తప్పుడు కేసులు పెట్టినట్టు అర్థమవుతోందన్నారు. అంతేకాదు.. గతంలో భూమా నాగిరెడ్డిపైనా ఇలాంటి కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని.. ఇప్పుడు కూడా తన భర్తనే అదే విధంగా ఇబ్బందులు పెడుతున్నారని అఖిలి చెప్పుకొచ్చారు. ఎలాంటి తప్పు చేయకపోయినా అన్యాయంగా కేసులు పెట్టారని ఆమె ఆరోపిస్తున్నారు. మేమేం తప్పుచేయలేదు.. పారిపోవాల్సిన ఖర్మ మా ఆయనకు పట్టలేదని అఖిల చెప్పారు.

తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని తనకూ తెలుసు, కేసు పెట్టినవాళ్లకూ తెలుసు, పోలీసులకూ తెలుసంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక చిన్న సివిల్ కేసును అటెంప్ట్ మర్డర్ కేసుగా మార్చేందుకు పోలీసులు ఎందుకింతగా ఇన్వాల్వ్ అవుతున్నారో మాకు అర్థం కావడంలేదన్నారు. అయితే పోలీసుల వాదన మాత్రం ఇంకోలా ఉంది.. ఈ క్రమంలో ఈ కేసు వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.