close
Choose your channels

చిరు మైత్రీతో చేస్తాడా?

Tuesday, November 5, 2019 • తెలుగు Comments

చిరు మైత్రీతో చేస్తాడా?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత `ఖైదీ నంబ‌ర్ 150`, `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సాధించాడు. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో 152 సినిమాను చే్స్తున్నాడు. కాగా.. ప్ర‌స్తుతం తెలుగు చిత్రసీమ‌లో పెద్ద నిర్మాణ సంస్థ‌లో ఒక‌టి చెప్పుకుంటున్న మైత్రీ మూవీ మేక‌ర్స్ ఇప్పుడు ఇప్పుడు మెగాస్టార్‌తో సినిమా చేయాల‌నుకుంటుంది. ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి కూడా సుకుమార్‌ను బ్లాక్ చేసింద‌ట‌. స‌రైన స్టార్ హీరో కోసం ఎదురు చూస్తున్న త‌రుణంలో వీరి కంట మెగాస్టార్ చిరంజీవి కంట‌ప‌డ్డాడు. 

ఇది వ‌ర‌కు చిరంజీవి త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్‌తో రంగ‌స్థ‌లం వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేక‌ర్స్ ఇప్పుడు ఆ స‌మ‌యంలో ఏర్ప‌డిన స్నేహ బంధంతో రామ్‌చ‌ర‌ణ్‌ను స‌పోర్ట్ తీసుకుని చిరుతో సినిమా చేయాల‌నుకుంటుంది. బ‌న్నితో సుకుమార్ పూర్తి చేయ‌గానే చిరంజీవి సినిమాను ట్రాక్ ఎక్కించాల‌నుకుంటుంది. ఈలోపు చిరంజీవి ఎలాగూ కొర‌టాల సినిమాను పూర్తిచేసేస్తాడు కాబ‌ట్టి మైత్రీ చిరుతో గ్రీన్ సిగ్న‌ల్ తీసుకోవాల‌నుకుంటుంది. ఎలాగూ రంగ‌స్థ‌లం సినిమా మేకింగ్ విష‌యంలో చిరు హ్యాపీగా ఉండ‌టంతో వీరి ప్ర‌య‌త్నానికి స‌మ‌స్య ఉండ‌క‌పోచ్చు. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు ముందుకెళుతుందో చూడాలి.

Get Breaking News Alerts From IndiaGlitz