ఎన్ 95 మాస్కులు కరోనాను కట్టడి చేయలేవు: డీజీహెచ్ఎస్

  • IndiaGlitz, [Tuesday,July 21 2020]

ఎన్ 95 మాస్కుల వినియోగంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీహెచ్ఎస్) కీలక ప్రకటన చేసింది. ఎన్ 95 మాస్కుల వలన ఎలాంటి ఉపయోగమూ లేదని తెలిపింది. మన నోటి నుంచి విడుదలయ్యే వైరస్‌ను వాల్వ్ కలిగిన ఎన్ 95 మాస్క్ అడ్డుకోలేదని తెలియజేస్తూ అన్ని రాష్ట్రాల వైద్యాధికారులకూ లేఖలు రాసింది. నోరు, ముక్కు మూసేసి ఉన్న మాస్కులను మాత్రమే వాడాలని డీజీహెచ్ఎస్ సూచించింది. తప్పనిసరిగా స్టెరైల్ ఫీల్డ్‌ను మెయిన్‌టైన్ చేయాల్సిన ప్రదేశాల్లో కవాటాలున్న మాస్కులను వాడినట్టయితే మనం వదిలేసిన గాలిని అది నేరుగా అక్కడి వాతావరణంలోకి వదిలేస్తాయని.. అప్పుడు వైరస్ కట్టడి కోసం మాస్కులను వాడాలన్న నిబంధనకు అర్థమే లేకుండా పోతుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(సీడీసీ) సూచించింది.

More News

‘ఆచార్య’ కోసం స్పెషల్ సెట్

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. మెసేజ్ మిక్స్ చేసిన క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

తెలంగాణ కరోనా అప్‌డేట్.. తగ్గిన కేసులు..

తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్‌ను సోమవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

‘బిగ్‌బాస్’ తెలుగు అప్‌డేట్ వచ్చేసింది..

బిగ్‌బాస్ సీజన్ స్టార్ట్ అవుతుందంటేనే ముందు నుంచే ఊహాగానాలు మొదలవుతుంటాయి. సీజన్ 4 కి సంబంధించి కూడా ఎప్పటి నుంచో ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

ఏపీ మంత్రివర్గ విస్తరణ.. కీలకమైన రెవెన్యూ ధర్మానకు!

ఈ నెల 22న ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే.

వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం

విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. ఎప్పటి నుంచో తమ తండ్రి ఆరోగ్యం రీత్యా బెయిల్ మంజూరు చేయాలని ఆయన కూతుళ్లు న్యాయస్థానానికి