'కాలా' గురించి 'నా బంగారు తల్లి' ఏమందంటే..

  • IndiaGlitz, [Monday,April 09 2018]

'నా బంగారు తల్లి' సినిమాకుగాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్న‌ నటి అంజలి పాటిల్. ఆ తర్వాత పలు  హిందీ సినిమాలతో పాటు మరాఠి, ఆంగ్ల చిత్రాల్లోనూ నటిస్తూ వచ్చారు అంజ‌లి.  ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీ కాంత్, ద‌ర్శ‌కుడు పా.రంజిత్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న'కాలా'లో ఓ ముఖ్య పాత్రలో నటించారు ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్‌.

రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రజనీ మాఫియా డాన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో.. పుయల్ చారుమతి గైక్వాడ్ అనే పాత్ర‌లో ముంబైలో జీవించే తమిళమ్మాయిగా కనిపించనున్నారు అంజలి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఆమె మీడియాతో పంచుకున్నారు.

సినిమాలో సగభాగాన్ని తమిళనాడులో చిత్రీకరించగా.. మిగిలిన భాగాన్ని మహారాష్ట్రలో షూటింగ్ చేశారని ఆమె తెలియజేశారు. రజనీ కాంత్ వంటి సూపర్ స్టార్‌తో కలిసి తెరను పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాననీ, ఆయనతో కలిసి చాలా సన్నివేశాల్లో కనిపిస్తాన‌ని ఆమె పేర్కొన్నారు.అంతేగాకుండా.. రజనీ కాంత్‌ను చూసి చాలా  విష‌యాలు నేర్చుకున్నానని చెబుతున్నారు ఈ నేషనల్ అవార్డు విన్నర్.

ఇదిలా ఉంటే.. ధనుష్ నిర్మించిన ఈ చిత్రానికి  14 కట్స్‌తో సెన్సార్  యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ నెల 27న చిత్రం విడుదల కావాల్సి ఉండగా.. జూన్ 15కు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. 

More News

మెగా హీరోతో మరోసారి

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ త్వరలో ఓ మూవీలో నటించబోతున్న‌ సంగతి తెలిసిందే. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

అమెరికాలోని అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకొంటున్న'సాక్ష్యం'

బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీవాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'సాక్ష్యం' ప్రస్తుతం అమెరికాలో చిత్రీకరణ జరుపుకుంటోంది.

నా కెరియర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇదే.. ప్రభుదేవా

తన ప్రతి సినిమాతో  విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ సక్సెస్ లను సొంతం చేసుకుంటున్న కార్తిక్ సుబ్బరాజ్ నిశ్శబ్ధంతో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయబోతున్నారు.

'RX 100' జూన్‌లో విడుద‌ల‌!

రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ సౌండ్ ఎక్క‌డ వినిపించినా గుండెల్లో గుబులు పుట్టించే విల‌న్ గుర్తొస్తాడు. స్కూటీ.. అన‌గానే చ‌లాకీగా న‌వ్వుతూ, చ‌క్క‌గా తుళ్లుతూ తిరిగే అంద‌మైన  అమ్మాయి గుర్తుకొస్తుంది.

ప్ర‌భాస్, పూజా హెగ్డే మూవీ అప్‌డేట్‌

ప్రస్తుతం యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్‌.. యువ ద‌ర్శ‌కుడు సుజిత్ రూపొందిస్తున్న 'సాహో' సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.