close
Choose your channels

నా నువ్వే.. నిడివి ఎంతంటే..

Wednesday, May 16, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నా నువ్వే.. నిడివి ఎంతంటే..

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ క‌థానాయకుడిగా న‌టించిన తాజా చిత్రం నా నువ్వే. త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి 180 ఫేమ్ జయేంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌ముఖ ఛాయాగ్రాహ‌కుడు పి.సి.శ్రీ‌రామ్ ఛాయాగ్ర‌హ‌ణం అందించిన ఈ సినిమాకి.. షెర‌త్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవ‌ల విడుద‌లైన ఆడియోకు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఇదిలా ఉంటే.. ఈ నెల 25న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న నేప‌థ్యంలో ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వినిపిస్తోంది.

అదేమిటంటే.. ఈ సినిమా నిడివి కేవ‌లం 118 నిమిషాలు మాత్ర‌మే ఉంటుంద‌ని స‌మాచారం. అంటే.. 1 గంట 58 నిమిషాల నిడివితో ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌న్న‌మాట‌. ఒక విధంగా ఇది సినిమాకి క‌లిసొచ్చే అంశంగానే చెప్పుకోవాలి. ఈ సినిమా కోసం క‌ల్యాణ్ రామ్ మేకోవ‌ర్ అయిన విధానంతో పాటు.. ప్ర‌చార చిత్రాలు కూడా సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి. ఈ చిత్రంలో త‌మ‌న్నా రేడియో జాకీ పాత్ర‌లో సంద‌డి చేయ‌నుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.