Oscar Nominations 2023 : ఆస్కార్‌కు అడుగు దూరంలో ‘‘ఆర్ఆర్ఆర్’’.. నాటు నాటుకు నామినేషన్

  • IndiaGlitz, [Tuesday,January 24 2023]

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌ అవార్డ్‌కు అడుగు దూరంలో నిలిచింది. 95వ ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను ది అకాడమీ మంగళవారం ప్రకటించింది. కోట్లాది భారతీయులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఆర్ఆర్ఆర్‌ చిత్రంలోని ‘‘నాటు నాటు’’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 భాషల సినిమాలు షార్ట్ లిస్ట్ కాగా.. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన సినిమాలను ఓటింగ్ ద్వారా ఆస్కార్ అవార్డుల కమిటీ తుది జాబితాకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంది. లగాన్ తర్వాత ఓ భారతీయ చిత్రం ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడం ఇదే తొలిసారి. ఇకపోతే.. డాక్కుమెంటరీ ఫీచర్ కేటగిరీలో షానూక్‌సేన్ ‘ఆల్ దట్ బ్రెత్స్’, డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విష్పర్స్’ నామినేట్ అయ్యాయి. అయితే ఈ ఏడాది భారత ప్రభుత్వం గుజరాతీ చిత్రం చెల్లో షోను ఆస్కార్ నామినేషన్స్‌కు పంపినా తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది.

భారత్ నుంచి ఇప్పటి వరకు 54 సినిమాలు షార్ట్‌లిస్ట్‌కి:

ఇదిలావుండగా .. మనదేశం నుంచి ఆస్కార్ బరిలో నిలిచిన తొలి చిత్రంగా ‘మదర్ ఇండియా’ నిలిచింది. దీని తర్వాత దాదాపు 40 ఏళ్లకు 1988లో ‘సలామ్ బాంబే’ ఆస్కార్ నామినేషన్స్‌లో నిలిచింది. అనంతరం బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన ‘లగాన్’ చిత్రం ఉత్తమ విదేశీ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఏ భారతీయ చిత్రం ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకోలేకపోయింది. మొత్తంగా చూస్తే 1957 నుంచి నేటి వరకు మొత్తం 54 భారతీయ చిత్రాలు ఆస్కార్ షార్ట్ లిస్ట్‌ వరకు వెళ్లాయి. ఇక తెలుగు సినిమా విషయానికి వస్తే.. కే విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వాతిముత్యం’ చిత్రం ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌కు వెళ్లింది. అయితే స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఏఆర్ రెహమాన్, రసూల్ పూకుట్టిలను ఆస్కార్ వరించింది. ఈ ఏడాది మార్చి 13న ఆస్కార్ అవార్డ్‌లను ప్రదానం చేయనున్నారు.

అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంటున్న ఆర్ఆర్ఆర్:

మరోవైపు.. ఆర్ఆర్ఆర్ ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డ్‌లను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా 46వ జపాన్ అకాడమీ ఫిల్మ్ ప్రైజ్‌కు సంబంధించి ‘‘ఔట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్’ అవార్డ్‌ను సాధించింది. అవతార్ 2, టాప్ గన్: మ్యూవరిక్ వంటి హాలీవుడ్ చిత్రాలను పక్కకునెట్టి ఆర్ఆర్ఆర్ ఈ ప్రతిష్టాత్మక అవార్డ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’’ చిత్రంలోని ‘‘నాటు నాటు’’ పాటకు ప్రపంచ ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వరించిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటుకు ఈ పురస్కారం దక్కింది. దీంతో టాలీవుడ్ సంబరాల్లో మునిగిపోయింది.

More News

Karthika Deepam : తెలుగు సీరియల్ సత్తా చాటి, టీఆర్పీల మోత మోగించిన కార్తీక దీపానికి ఎండ్ కార్డ్

కార్తీక దీపం.. ఈ పేరు తెలియని తెలుగు వారు ముఖ్యంగా మహిళలు వుండరు.

జనవరి 26న 'సిందూరం'

నక్షలిజంపై ఎక్కుపెట్టిన బాణం సిందూరం !

Pawan kalyan : రేపు కొండగట్టుకు పవన్ కల్యాణ్.. టూర్ షెడ్యూల్ ఇదే ..!!

రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.

చికాగోలో తెలుగు విద్యార్ధిపై కాల్పులు.. హైదరాబాద్‌ బీహెచ్ఈఎల్‌లో విషాద ఛాయలు

అమెరికాలో తెలుగు విద్యార్ధిపై అక్కడి నల్లజాతీయులు కాల్పులు జరిపారు.

YS Viveka : వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు.. విచారణకు రావాల్సిందిగా ఆదేశం

మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.