దిమాక్ ఖరాబ్ చేస్తున్న నభా నటేష్

  • IndiaGlitz, [Sunday,June 09 2019]

కొన్నాళ్ల క్రితం జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో ఇచ్చిన హాట్ పెర్ఫార్మెన్స్ తో దర్శకేంద్రుడి మన్ననలు అందుకున్న టాలెంటెడ్ & గ్లామరస్ హీరోయిన్ నభా నటేష్ ఇటీవల విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలోని 'దిమాక్ ఖరాబ్' లిరికల్ వీడియోలో కనిపించిన స్టిల్స్ లో గ్లామర్ డోస్ గట్టిగా అద్దానని సూచనలిచ్చింది. రెండ్రోజుల క్రితం విడుదలైన ఈ లిరికల్ వీడియో ప్రస్తుతం ఇండియావైడ్ #3 వ స్థానంలో ట్రెండింగ్ లో ఉంది.

చాలా తక్కువ మంది కథానాయికలు మాత్రమే అందం-అభినయ సామర్ధ్యంతో మెప్పించగలరు. వారిలో నభా పేరు ముందు వరుసలో నిలుస్తుంది. ప్రస్తుతం రవితేజతో డిస్కో రాజా, రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో బిజీగా ఉన్న నభాకు టాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఆమె ఇటీవలే డిస్కో రాజా షూట్ లో పాల్గొంది. రవితేజతో కలిసి నటించబోయే ఈ సినిమా గురించి నభా చాలా ఎగ్జైటెడ్ గా ఉంది. ఈ సినిమాలో రవితేజతో కలిసి ఆమె నటించబోయే కామెడీ సీన్స్ కోసం నభా వెయిట్ చేస్తోంది.

నభా కామెడీ టైమింగ్ 'నన్ను దోచుకోందువటే' ట్రైలర్లో చూసినప్పుడు బాగా నచ్చింది. అందుకే ఆ సినిమా విడుదలకు ముందే ఆమెను డిస్కో రాజా సినిమా కోసం సైన్ చేసాం' అని డిస్కో రాజా టీమ్ మెంబర్ తెలిపారు. నభాతో షూటింగ్ చాలా సరదాగా ఉంటుంది. ఆమె చాలా ఎనర్జిటిక్ & హాక్టివ్. ఆమె ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాలా క్రేజీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పటివరకూ ఈ తరహా పాత్రను తెలుగు ప్రేక్షకులు చూసి ఉండరు అని ఇస్మార్ట్ శంకర్ టీమ్ మేట్ తెలిపారు. ఇప్పుడు అందరి చూపు త్వరలో విడుదల కానున్న ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ మీద ఉంది. మరి లిరికల్ వీడియో స్టిల్స్ తోనే కుర్రాళ్ళ మతులు పోగొట్టిన నభా.. ట్రైలర్ లో ఎలా కనిపించబోతొందో చూద్దాం

More News

'శివలింగాపురం' ఆడియో, ట్రైలర్ విడుదల

తమిళ, మలయాళ భాషలలో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆర్.కె.సురేష్ ఇప్పుడు శివలింగాపురం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా జూన్ 28న రాజశేఖర్ 'కల్కి' విడుదల!

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'కల్కి'. తెలుగు ప్రేక్షకులకు 'అ!' వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రాన్ని అందించిన ప్రశాంత్ వర్మ దర్శకుడు.

'వాల్మీకి' విడుద‌ల ఫిక్స్‌

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా హ‌రీష్ శంక‌ర్‌.ఎస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `వాల్మీకి`.

గోపీచంద్‌, ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సినిమా టైటిల్ 'చాణక్య‌'

గోపీచంద్ హీరోగా ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై తిరు ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా రూపొందుతోన్న భారీ స్పై థ్రిల్ల‌ర్ చిత్రానికి `చాణక్య‌`

ఇదేం మామూలు విషయం కాదు: లక్ష్మీనారాయణ

ఆంధప్రదేశ్ ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఆ షాక్ నుంచి తేరుకోక మునుపే నేతలు జంపింగ్‌లు షురూ చేశారు.