close
Choose your channels

భారీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న న‌భా న‌టేశ్‌

Tuesday, June 23, 2020 • తెలుగు Comments

భారీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న న‌భా న‌టేశ్‌

న‌న్నుదోచుకుందువ‌టే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన హీరోయిన్ న‌భా న‌టేశ్. త‌ర్వాత మంచి అవ‌కాశాల‌నే ద‌క్కించుకుంది. గ‌త ఏడాది ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంలో చాందిని పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకుంది న‌భా. ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ‘సోలో బ్ర‌తుకే సో బెట‌రు’ సినిమాలో.. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెర‌కెక్కుతున్న ‘అల్లుడు అదుర్స్‌’ చిత్రంలోనూ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాల‌న్నీ విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. అయితే తాజాగా సోష‌ల్ మీడియాలో న‌భాన‌టేశ్ ఓ భారీ చిత్రంలో న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంద‌ని టాక్‌. ఇంత‌కూ ఆ సినిమా ఎవరిదో కాదు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొంద‌బోయే చిత్రం.

భారీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న న‌భా న‌టేశ్‌

ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్‌లో ఒప్ప‌టికే ఓ హీరోయిన్‌గా పూజా హెగ్డే న‌టిస్తుండ‌గా, మ‌రో హీరోయిన్ పాత్ర‌లో న‌భాను ఎంపిక చేశార‌ని టాక్‌. ఇందులో న‌భా న‌టేశ్ తెలంగాణ అమ్మాయిగా క‌నిపించ‌నుంద‌ట‌. ఈ చిత్రానికి అయిన‌నూ పోయి రావ‌లె హ‌స్తిన‌కు అనే టైటిల్‌ను అనుకుంటున్నార‌ని టాక్‌. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన త‌ర్వాత ఈ సినిమా షూటింగ్స్ స్టార్ట్ కానుంది.

Get Breaking News Alerts From IndiaGlitz