పవన్ కల్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన నాదెండ్ల.. రూట్ మ్యాప్ ఇది, ప్రతి చోటా జనవాణి

  • IndiaGlitz, [Tuesday,June 06 2023]

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలతో మమేకం కానున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 14 నుంచి ఆయన వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. ఈ మేరకు వారాహి యాత్ర పోస్టర్‌ను జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సోమవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. దీనితో పాటు రూట్ మ్యాప్, యాత్రలో పర్యటించనున్న జనసేన అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కర్తలను ఆయన ప్రకటించారు.

నియోజకవర్గాల వారీగా జనసేన సమన్వయకర్తలు :

కాకినాడ రూరల్ - నయుబ్ కమల్
కాకినాడ అర్బన్ - గాదె వెంకటేశ్వర రావు
ముమ్మిడివరం - బొలిశెట్టి సత్యనారాయణ
అమలాపురం - బోనబోయిన శ్రీనివాస యాదవ్, సుందరపు విజయ్ కుమార్
పి.గన్నవరం - గడసాల అప్పారావు
రాజోలు - చిలకం మధుసూదన్ రెడ్డి
నర్సీపట్నం - బొలిశెట్టి సత్యనారాయణ, వంపూర్ గంగులయ్య
పాయకరావుపేట - గడసాల అప్పారావు, మూగి శ్రీనివాస్
యలమంచిలి - బండ్రెడ్డి రామక్రిష్ణ, బేతపూడి విజయశేఖర్
తుని - బోనబోయిన శ్రీనివాస యాదవ్, తాతంశెట్టి నాగేంద్ర
ప్రత్తిపాడు - చిలకం మధుసూదన్ రెడ్డి, అక్కల గాంధీ
పిఠాపురం - బొమ్మిడి నాయకర్, చిల్లపల్లి శ్రీనివాస్

అన్నవరంలో పవన్ ప్రత్యేక పూజలు :

ఈ నెల 14న అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కత్తిపూడి జంక్షన్ మీదుగా పవన్ కల్యాణ్ వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు , పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు మీదుగా .. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు, నర్సాపురం, భీమవరంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోందని నాదెండ్ల తెలిపారు.

ప్రతి నియోజకవర్గంలో జనవాణి :

వారాహి యాత్ర సాగే ప్రతి నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ యాత్రలో అన్ని వర్గాల ప్రజలను పవన్ కలిసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశామని.. ఒక్కో నియోజకవర్గంలో రెండు రోజుల పాటు వారాహి యాత్ర కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉదయం తాను బస చేసిన ప్రాంతంలోని స్థానిక సమస్యలపై పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమం నిర్వహిస్తారని నాదెండ్ల మనోహర్ చెప్పారు.

More News

వట్టిచెరుకూరు ట్రాక్టర్ ప్రమాదం.. గుంటూరు జీజీహెచ్‌లో క్షతగాత్రులను పరామర్శించిన నాదెండ్ల మనోహర్

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు మరణించిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. 20 మంది వరకు గాయపడ్డారు.

జనసేన ఆస్ట్రేలియా సహ సమన్వయకర్తలు వీరే .. నాగబాబు కీలక ప్రకటన

పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో బలమైన కేడర్ వున్న సంగతి తెలిసిందే. అలాగే వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు సైతం పవన్ భావజలాన్ని, ప్రణాళికలను

Janasena: అనుకోని ప్రమాదాలు.. రోడ్డునపడ్డ జనసైనికుల కుటుంబాలు: నేనున్నానంటూ పవన్, బీమా అందజేసిన నాదెండ్ల

ప్రజలకు ఏదో ఒకటి చేయాలని, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించారు పవన్ కల్యాణ్. 2014లో పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకు ఆయన తన కష్టాన్నే నమ్ముకుని ముందుకు వెళ్తున్నారు.

శ్రీకాంత్ కూతురిని చూశారా.. ఆ అందం ముందు హీరోయిన్లు కూడా దిగదుడుపే

టాలీవుడ్‌లో వున్న విలక్షణ నటుల్లో శ్రీకాంత్ ఒకరు. విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను మెప్పించారు. లవ్, రోమాంటిక్, ఫ్యామిలీ డ్రామా, జానపదం, పౌరాణికం,

Shaitan Trailer: 'సైతాన్' ట్రైలర్ : వామ్మో.. నెక్ట్స్ లెవల్‌లో క్రైమ్ సీన్లు, బూతులు, బోల్డ్ కంటెంట్

డిఫరెంట్ జోనర్‌లో సినిమాలు చేస్తూ అభిరుచి వున్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు మహి వీ రాఘవ. ఆనందో బ్రహ్మా వంటి కామెడీ చిత్రంతో తన టాలెంట్ నిరూపించుకున్న ఆయన తర్వాత ఎవరు