close
Choose your channels

విడుదలకు సిద్ధమవుతోన్న నదియా 'దేవి'

Saturday, August 19, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్ర‌ముఖ న‌టి న‌దియా ప్ర‌ధాన పాత్రలో రూపొందిన చిత్రం తిరుక్కువరాధ‌కాది`. త‌మిళంలో ప‌దిహేను కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసిన ఈ సినిమాను వైన‌వి స‌మ‌ర్ప‌ణ‌లో సువ‌ర్ణ పిక్చ‌ర్స్ బేన‌ర్‌పై తెలుగులో `దేవి` పేరుతో విడుద‌ల చేస్తున్నారు. సువ‌ర్ణ నిర్మాత‌. డి.తుల‌సిదాస్ ద‌ర్శ‌కుడు. ప‌గ‌, ప్ర‌తీకార నేప‌థ్యంలో హార‌ర్ జోన‌ర్‌లో ఈ సినిమా రూపొందింది.

ఈ సినిమా ప్ర‌స్తుతం తెలుగులో అనువాద కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. `దృశ్యం` త‌ర్వాత న‌దియా పోలీస్ పాత్ర‌లో న‌టించిన చిత్ర‌మిది. ఈ సినిమాలో న‌దియా పాత్ర‌కు చాలా అద్భుతంగా ఉంటుంది. ద‌ర్శ‌కులు తుల‌సీదాస్‌గారు సినిమాను ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించారు. త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని నిర్మాత సువ‌ర్ణ తెలిపారు. న‌దియా, కోవై స‌ర‌ళ‌, ఇనియా, ఆర్తి, సంగీత‌, అర్చ‌న త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి క‌థః మ‌నోజ్‌.ఆర్‌, సంగీతంః ఎం.జి.శ్రీకుమార్‌, ఎడిట‌ర్ః కె.శ్రీనివాస్‌, సినిమాటోగ్ర‌ఫీః సంజీవ్ శంక‌ర్‌, నిర్మాతః సువ‌ర్ణ‌, దర్శ‌క‌త్వంః తుల‌సీదాస్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.