నడిగర్ సంఘం ఎన్నికలు నిలిపివేత..?
Send us your feedback to audioarticles@vaarta.com
నడిగర్ సంఘం ఎన్నికలు జరగవా? ఎన్నికలను నిలిపేస్తారా? ఇప్పుడు సౌత్ ఇండియాలో ఆర్టిస్టుల మధ్య ఇదే టాపిక్. ఎందుకంటే చెన్నైలో ఉన్న నడిగర్ సంఘం కేవలం తమిళులకు మాత్రమే సంబంధించినది కాదు. అది సౌత్ ఇండియా ఆర్టిస్ట్ అసోసియేషన్. అందుకే సౌత్ ఇండియాలో ఇప్పుడు ఆర్టిస్టుల మధ్య ఈ చర్చ జరుగుతోంది. విశాల్ తెలుగు వాడని కొందరు, విశాల్ తప్పులు చేశారని కొందరు అతన్ని దూషిస్తున్నారు.
ఈ నెల 23న జరుగనున్న ఈ ఎన్నికల్లో విశాల్ తరఫున పాండవర్ అని, కె.భాగ్యరాజ్ తరఫున ఓ టీమ్ పోటీ చేస్తున్నాయి. విశాల్ టీమ్ లో తమ తరఫున స్లీపర్ సెల్స్ ఉన్నట్టు భాగ్యరాజ్ టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే.పలురకాల ఉత్కంఠల మధ్య ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికలను నిలిపివేసే అవకాశాలే ఎక్కువ ఉన్నట్టు కోడంబాక్కం టక్. ఈ నేపథ్యంలో విశాల్ గవర్నర్ను కూడా కలిశారు. ``కోర్టు ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు తప్పక జరుగుతాయి` అని విశాల్ ప్రకటించినట్టు వినికిడి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.