పవన్, చెర్రీ తరువాత బన్నీతో..

  • IndiaGlitz, [Friday,March 02 2018]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో మ‌ర‌పురాని చిత్రాల‌లో 'అత్తారింటికి దారేది' ఒక‌టి. ఆ సినిమా విజ‌యంలో సీనియ‌ర్ క‌థానాయిక న‌దియా పాత్ర కూడా ఎంతో కొంత ఉంద‌నే చెప్పాలి. ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ సినిమా త‌రువాత‌.. మ‌రో మెగా హీరో న‌టించిన సినిమాలోనూ ఆమె ఓ ముఖ్య‌మైన పాత్ర చేశారు. ఆ హీరో మెగాప‌వ‌ర్ స్టార్‌ రామ్ చ‌ర‌ణ్ కాగా.. ఆ చిత్రం 'బ్రూస్ లీ'. మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అయితే.. బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ‌ప‌రిచింది.

ఇదిలా ఉంటే.. మ‌ళ్ళీ మూడేళ్ల త‌రువాత మ‌రో మెగా హీరో సినిమాలో న‌దియా ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. ఈ సారి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంతు అయ్యింది. ఈ మెగా హీరో ప్ర‌స్తుతం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' పేరుతో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక కాగా.. అర్జున్‌, శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. వీరితో పాటు న‌దియా కూడా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ప‌వ‌న్ లాగే బ‌న్నికి కూడా న‌దియా క‌లిసొస్తారో లేదో చూడాలి.

More News

శ్రీకాంత్ కాదు.. ప్రకాష్ రాజ్

శతాధిక చిత్రాల నటుడు శ్రీకాంత్..ఇటీవల ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ కనిపిస్తున్న సంగతి తెలిసిందే.ఆ మధ్య గోవిందుడు అందరివాడేలే,సరైనోడు చిత్రాలలో ఆయన చేసిన పాత్రలు మంచి పేరును తీసుకువచ్చాయి.అంతేగాకుండా,గతేడాది నాగచైతన్య

చిరుకి ఫ్రెండ్.. రజనీకి శత్రువు..

మెగాస్టార్ చిరంజీవికి ఫ్రెండ్ అంటే..సూపర్ స్టార్ రజనీకాంత్ కు కూడా ఫ్రెండ్ కావాలి కదా.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం

వరస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్,శ్రీవాస్ దర్శకత్వంలో

మహేష్ 25వ చిత్రానికి బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్

సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడుగా సూపర్హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో

మార్చ్ 16 న విడుదల కానున్న 'కిర్రాక్ పార్టీ'

నిఖిల్ హీరోగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరెకెక్కిన కిర్రాక్ పార్టీ చిత్రాన్ని మార్చ్ 16 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయనున్నారు.