ప్రాజెక్ట్ కే : మీ సాయం కావాలి.. ఆనంద్ మహీంద్రాకు నాగ్ అశ్విన్ రిక్వెస్ట్

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ ప్రమోషన్‌లో బిజీగా వున్నారు. మార్చి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. అనేక వాయిదాల అనంతరం మార్చి 11న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తామని స్వయంగా ప్రభాస్ అనౌన్స్ చేశారు. రాధేశ్యామ్‌తో పాటు ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలకు ప్రభాస్ నటిస్తున్నారు.

మహానటి ఫేం నాగ్ అశ్విన్‌ డైరెక్ట్ చేస్తున్న ‘‘ప్రాజెక్ట్ కే’’ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా... అలాగే అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రను సాయం కోరాడు నాగ్ అశ్విన్. ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేశాడు. ‘‘ డియర్ ఆనంద్ మహేంద్ర సార్… తాము అమితాబ్, ప్రభాస్, దీపికలతో కలిసి ప్రాజెక్ట్ కే అనే సైన్స్ ఫిక్షన్ మూవీని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా కోసం మేం రూపొందించే కొన్ని వాహనాలు ప్రత్యేకమైనవి, నేటి సాంకేతికతకు మించినవి కావాలి.

మన దగ్గర ప్రతిభావంతులైన భారతీయ ఇంజనీర్లు, డిజైనర్ల బృందం ఉందని... ఇంతకు ముందు ఇలాంటి సినిమాని ఎవ్వరూ ప్రయత్నించలేదని నాగ్ అశ్విన్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే సినిమా రూపకల్పనలో మీరు మాకు సహాయం చేయగలిగితే గౌరవంగా ఉంటుంది అంటూ ఆ ట్వీట్‌లో తెలిపాడు. దీనిని బట్టి.. ‘‘ప్రాజెక్ట్ కే’’ సినిమాలో ఉపయోగించే వాహనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. మరి నాగ్ అశ్విన్‌ రిక్వెస్ట్‌కు ఆనంద్ మహీంద్రా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More News

‘‘హను మాన్’’ నుంచి వరలక్ష్మీ ఫస్ట్‌లుక్.. మరోసారి జయమ్మ ఉగ్రరూపం

తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు తెరకెక్కించి పేరు తెచ్చుకున్న దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు.

హీరోయిన్ కాకుండా వుంటే.. కోహ్లీలా వుండేదేమో: సమంతపై జిమ్ ట్రైనర్ ప్రశంసలు

హీరోలతో పోలిస్తే హీరోయిన్ల స్టార్‌డమ్, కెరీర్ స్పాన్ చాలా తక్కువ. మంచి అవకాశాలొచ్చి, ఆ సినిమాలు హిట్టయితే ఐదేళ్లు,

అందుకే మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను చంపాలనుకున్నా : నిందితుడు రాఘవేంద్రరాజు

తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రపన్నిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది.

అసెంబ్లీకి ఆ అధికారం లేదు.. ఏ కార్యాలయాన్ని తరలించొద్దు: అమరావతిపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

ఏపీ మూడు రాజధానులు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రద్దు పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది.

యుద్ధాన్ని ఆపాలని నేను పుతిన్‌ను ఆదేశించగలనా : సీజేఐ జస్టిస్ ఎన్. వీ. రమణ

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో భారతీయుల తరలింపుపై కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.