నాలుగవ షెడ్యూల్ లో నాగ అన్వేష్ ఏంజెల్

  • IndiaGlitz, [Tuesday,January 17 2017]

మన్యంపులి సూపర్ హిట్ తరువాత శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సోషియోఫాంటసీ ఎంటర్ టైనర్ ఏంజెల్. గతేడాది షూటింగ్ మొదలుపెట్టిన ఈ చిత్ర యూనిట్ ఇప్పటికే మూడు షెడ్యూల్స్ దిగ్విజయంగా పూర్తిచేసుకుంది. తాజాగా ఈనెల‌ 16 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నాలుగ‌వ‌ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. యంగ్ టాలెంటెడ్ హీరో నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి దర్శక ధరీడు రాజమౌళి అసోసియేట్ బాహుబలి పళని దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక ప్రస్తుతం జరుగుతోన్న షెడ్యూల్ ని ఈ నెలాఖరు వరకు నిర్విహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ఈ చిత్ర నిర్మాత భువన్ సాగర్ తెలిపారు. ఈ సినిమాలో సప్తగిరి, ప్రదీప్ రావత్, షియాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సెస్సరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ముప్పా వెంగయ్య చౌదరి సమర్పణలో సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై భువన్ సాగర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రచన : శ్రీనివాస్ లంకపల్లి, ఆర్ట్‌: వి.ఎస్. సాయిమణి, స్టంట్స్‌: రామ్ లక్ష్మణ్, డైలాగ్స్‌: వేంపల్లి రమేశ్ రెడ్డి, ఎడిటర్‌: చోట.కె.ప్రసాద్, సినిమాటోగ్రఫీ: గుణ, ద‌ర్శ‌క‌త్వం - ప‌ళ‌ని.

More News

ఆఖరి షెడ్యూల్ లో గోపీచంద్ - సంపత్ నంది చిత్రం..!

మాస్ స్టార్ గోపీచంద్,హ్యాట్రిక్ హిట్స్ డైరెక్టర్ సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్లో,శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్ పై

పవన్ - త్రివిక్రమ్ మూవీ లేటెస్ట్ అప్ డేట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో

రాజ్ తరుణ్ మూవీలో హంసానందిని..?

రాజ్ తరుణ్,వంశీకృష్ణ కాంబినేషన్ లో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'.

రామ్ చరణ్ మూవీలో మరో హీరోయిన్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ తో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

యు.ఎస్ లో బాలయ్య సక్సెస్ టూర్..!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.సంక్రాంతి కానుకగా