close
Choose your channels

చైతు, నాని బాక్సాఫీస్ పోటీ...

Tuesday, February 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చైతు, నాని బాక్సాఫీస్ పోటీ...

అక్కినేని నాగ‌చైత‌న్య‌, నాని పోటీ ప‌డ‌నున్నారు. ఎందులో.. ఎక్క‌డో అనుకుంటున్నారు. బాక్సాఫీస్ వ‌ద్దేనండీ!. వివ‌రాల్లోకెళ్తే.. `నిన్ను కోరి` ఫేమ్ శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య‌, స‌మంత న‌టిస్తోన్న చిత్రం `మ‌జిలీ`. ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుద‌ల చేయ‌నున్నామ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ఇప్పుడు అదే తేదికి నాని జెర్సీ కూడా విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయంటున్నాయి సినీ వ‌ర్గాలు.

నాని, శ్రద్ధా శ్రీనాథ్ జోడిగా `మ‌ళ్ళీరావా` ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `జెర్సీ`. ఇందులో నాని క్రికెట‌ర్ కావాల‌నుకునే మ‌ధ్య వ‌య‌స్కుడిగా క‌న‌ప‌డ‌తారు. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 19న విడుద‌ల చేయాల‌నుకున్నారు కానీ.. ఇప్పుడు రెండు వారాల ముందుగా అంటే ఏప్రిల్ 5న విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ‌లు ఏమంటాయో చూద్దాం..

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.