రీమేక్ లో సమంత, చైతు...?

  • IndiaGlitz, [Monday,September 26 2016]

ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ రాసిన నవల ఆధారంగా రూపొందిన హిందీ చిత్రం టు స్టేట్స్‌' (2014) ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో రీమేక్‌ కానుంది. హిందీలో కరణ్‌ జోహార్‌ ధర్మ ప్రొడక్షన్స్, సాజిద్‌ నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌ దగ్గర పలు చిత్రాలకు కో–డైరెక్టర్‌గా వ్యవహరించిన వెంకట్‌ కుంచెమ్‌.. వినాయక్‌ సహకారంతో ఈ చిత్రం తెలుగు రీమేక్‌ హక్కులు దక్కించుకున్నారు. పంపిణీ రంగంలో పలు విజయాలు చూసిన అభిషేక్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తుంది.

కాగా అర్జున్ కపూర్, అలియాభట్ పాత్రలను తెలుగులో నాగచైతన్య, సమంతలతో చేయించడానికి నిర్మాతలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారట. వారితో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు ఫిలింనగర్ లో తిరుగుతున్నాయి. అయితే వచ్చే ఏడాదిన నాగచైతన్యను సమంత పెళ్ళి చేసుకోనున్న సంగతి తెలిసిందే. అందువల్ల పరిమితంగానే సమంత సినిమాలను చేస్తుంది. కల్యాణ్ కృష్ణ చిత్రంలో చైతు సరసన సమంత హీరోయిన్ అనుకున్నారు కానీ చివరకు రకుల్ ప్రీత్ హీరోయిన్ గా చేరింది. మరి ఈ రీమేక్ లో నటించడానికి చైతు, సమంతలు అంగీకరిస్తారా..ఏమో చూద్దాం...

More News

'హైపర్ ' సెన్సార్ పూర్తి...

ఎనర్జిటిక్ స్టార్ రామ్,టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్ వాస్ కాంబినేషన్ లో వెంకట్ బోయినపల్లి సమర్పణలో

శతమానంభవతి సెట్ లో సెల్పీ సందడి..!

రన్ రాజా రన్,మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు,ఎక్స్ ప్రెస్ రాజా చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం శతమానంభవతి.

అలా చేస్తే తప్పు ఏమిటి అని ప్రశ్నిస్తున్న తమన్నా..!

మిల్కీబ్యూటీ తమన్నా అలా చేస్తే తప్పు ఏమిటి అని ప్రశ్నిస్తుంది...ఇంతకీ ఏ విషయంలో అంటారా..?

ప్ర‌భుదేవ‌ని బాధ‌పెట్టిన చిరంజీవి..!

ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్ ప్ర‌భుదేవ న‌టించిన తాజా చిత్రం అభినేత్రి. ఈ చిత్రాన్ని విజ‌య్ తెర‌కెక్కించారు. ఈ చిత్రాన్ని త‌మిళ్ లో ప్ర‌భుదేవ నిర్మిస్తుండ‌డం విశేషం.

ఆ విష‌యంలో స‌మంత‌లా నేను ఎందుకు చేయాలి..? - త‌మ‌న్నా

అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంటూ ఒక్క తెలుగులోనే కాకుండా సౌత్ లో మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్న హీరోయిన్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో రూపొందుతున్న అభినేత్రి సినిమాలో త‌మ‌న్నా న‌టించింది.