నాగ‌చైత‌న్య‌.. సేమ్ టు సేమ్‌

  • IndiaGlitz, [Tuesday,September 12 2017]

రెండు వ‌రుస సంవ‌త్స‌రాల్లో ఒకేలాంటి ప‌రిస్థితులను చ‌విచూశాడు యువ క‌థానాయ‌కుడు అక్కినేని నాగ‌చైత‌న్య‌. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. గ‌తేడాది నాగ‌చైత‌న్య హీరోగా రెండు సినిమాలు విడుద‌ల‌య్యాయి. అందులో ఒక‌టి ప్రేమ‌మ్ కాగా.. మ‌రొక‌టి సాహ‌సం శ్వాస‌గా సాగిపో. వీటిలో ప్రేమ‌మ్ విజ‌యం సాధించ‌గా.. ఆ త‌రువాత వ‌చ్చిన సాహ‌సం శ్వాస‌గా సాగిపో ప‌రాజ‌యం పాలైంది.

క‌ట్ చేస్తే.. ఈ సంవ‌త్స‌రం కూడా చైతూ రెండు సినిమాల‌తో ప‌ల‌క‌రించాడు. మొద‌ట‌గా వ‌చ్చిన రారండోయ్ వేడుక చూద్దాం విజ‌యం సాధించ‌గా.. ఈ ఏడాదిలో వ‌చ్చిన రెండో సినిమా యుద్ధం శ‌ర‌ణం ప‌రాజ‌యం పాలైంది. అంటే.. నాగ‌చైత‌న్య రెండు వ‌రుస సంవ‌త్స‌రాల్లో ఒకేలాంటి ప‌రిస్థితుల‌ను చూశాడ‌న్న‌మాట‌.

ఇప్పుడు నాగ‌చైత‌న్య చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో స‌వ్య‌సాచి సినిమా చేస్తున్నాడు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొంద‌నున్న ఈ సినిమాపైనే నాగ‌చైత‌న్య ఆశ‌లు పెట్టుకున్నాడు.

More News

'స్పైడర్‌' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ తేదీ ఖరారు

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌.సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌'.

నయన్ కి పోటీగా సంతానం

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డిని,నటసింహం బాలకృష్ణ 102వ చిత్రంని ఒకే టైంలో ఒప్పుకుని

ర‌కుల్‌.. రెండు పండ‌గ‌లు..

రారండోయ్ వేడుక చూద్దాం, జ‌య‌జాన‌కి నాయ‌క చిత్రాల‌తో.. గ్లామ‌ర్ పాత్ర‌లే కాదు, పెర్‌పార్మెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర‌ల‌ని తాను చేయ‌గ‌ల‌న‌ని ఫ్రూవ్ చేసుకుంది ర‌కుల్ ప్రీత్ సింగ్‌.

800 థియేటర్స్ లో 'స్పైడర్'

మహేష్ బాబు సినిమాలకు ఓవర్సీస్ లో మంచి డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

పొల్లాచిలో బెల్లంకొండ శ్రీనివాస్ సాహసాలు!!

'డిక్టేటర్ ' వంటి డీసెంట్ హిట్ తర్వాత డైరెక్టర్ శ్రీవాస్ యంగ్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా