నాగ చైతన్య కూడా అదే బాటలో...

  • IndiaGlitz, [Sunday,April 30 2017]

యువసామ్రాట్‌ నాగచైతన్య హీరోగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై కళ్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'రారండోయ్‌ వేడుక చూద్దాం'. ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు, సంపత్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను మే 19న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని యూనిట్ వ‌ర్గాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి.

ఒక‌ప్పుడు సినిమాపై అంచ‌నాలు పెంచ‌డానికి భారీ ఆడియో విడుద‌ల వేడుక‌ను నిర్వ‌హించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చి ఒక్కొక్క పాట‌ను రిలీజ్ చేసి ప్రీ రిలీజ్ వేడుక‌ను నిర్వ‌హించేస్తున్నారు. ఇప్పుడు అదే విధంగా నాగ‌చైత‌న్య రారండోయ్ వేడుక చూద్దాం సినిమా పాట‌ల‌ను కూడా విడుద‌ల చేసి ప్రీ రిలీజ్ వేడుక‌ను నిర్వ‌హిస్తారు.