చైతు మూవీ రైట్స్ ద‌క్కించుకున్న టాప్ ప్రొడ్యూస‌ర్..!

  • IndiaGlitz, [Tuesday,October 25 2016]

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన ప్రేమ‌మ్ ద‌స‌రా కానుక‌గా రిలీజై ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మూవీ ఇచ్చిన స‌క్సెస్ సంతోషంలో చైతు సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. చైత‌న్య‌, మంజిమ మోహ‌న్ జంట‌గా గౌత‌మ్ మీన‌న్ తెర‌కెక్కించిన సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రాన్ని న‌వంబ‌ర్ 11న రిలీజ్ చేయ‌నున్నార‌ని తెలిసింది.

ఏమాయ చేసావే త‌ర్వాత చైత‌న్య‌, గౌత‌మ్ మీన‌న్ క‌లిసి న‌టించ‌డం, ప్రేమ‌మ్ స‌క్సెస్ త‌ర్వాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రం పై మంచి క్రేజ్ ఏర్ప‌డింది. దీంతో ఈ మూవీ నైజాం రైట్స్ ను ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ద‌క్కించుకున్న‌ట్టు స‌మాచారం. ఏమాయ చేసావే చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చైత‌న్య, గౌత‌మ్ మీన‌న్ కాంబినేష‌న్ సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రంతో కూడా సంచ‌ల‌నం సృష్టిస్తుందేమో చూడాలి..!

More News

మహేష్ సినిమా శాటిలైట్ హక్కులను సొంతంచేసుకున్న...

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

ఆ వార్తల పై క్లారిటి ఇచ్చిన బ్రహ్మి..!

హస్య బ్రహ్మ బ్రహ్మానందం డైరెక్షన్ చేయబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

కొరియోగ్రాఫ‌ర్ తో ప‌వ‌ర్ స్టార్ సెల్ఫీ..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.... త‌నతో వ‌ర్క్ చేసే ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్  తో చాలా స‌ర‌దాగా ఉంటారు. అందుక‌నే ప‌వ‌న్ తో వ‌ర్క్ చేయ‌డానికి ఇంట్ర‌స్ట్ చూపిస్తుంటారు. ఇక ప‌వ‌న్ తో వ‌ర్క్ చేసే అవ‌కాశం వ‌చ్చింది అంటే ఆ ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్ ఫుల్ హ్యాపీగా ఫీల‌వుతుంటారు.

ప్ర‌భాస్ నెక్ట్స్ మూవీలో బాలీవుడ్ భామ‌..!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రం షూటింగ్ డిసెంబ‌ర్ కి పూర్త‌వుతుంది. ఏప్రిల్ 28న బాహుబ‌లి 2 చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.

క‌ళ్యాణ్ రామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్..!

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టించిన తాజా చిత్రం ఇజం. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఇజం చిత్రం క‌ళ్యాణ్ రామ్ కి న‌టుడుగా మంచి పేరు తీసుకువ‌చ్చింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై రూపొందిన ఇజం చిత్రం విడుద‌లైన అన్ని ఏరియాల్లో మంచి క‌లెక్ష‌న్స్ తో స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతుంది.