నాగ‌చైత‌న్య తదుప‌రి ఖ‌రారైందోచ్‌!!

  • IndiaGlitz, [Saturday,December 14 2019]

ఈ శుక్ర‌వారం 'వెంకీమామ' విడుద‌లైంది. తొలి రోజున ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.16 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఈ సినిమా విడుద‌లై ఒక రోజు అయ్యిందో లేదో.. చైత‌న్య త‌దుప‌రి సినిమాను ఖ‌రారు చేశారు. అధికారిక స‌మాచారం మేర‌కు నాగ‌చైత‌న్య త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నాడు. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత 14 రీల్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్ర‌మిది.

'గీత గోవిందం' వంటి రూ.100 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించిన సినిమాను డైరెక్ట్ చేసిన ప‌రుశురాంకు వెంట‌నే సినిమాలు రాలేదు. ఆయ‌న త‌దుప‌రి సినిమా కోసం హీరోల చుట్టూనే గ‌ట్టిగానే తిరిగాడు. మ‌హేశ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి హీరోల చుట్టూ తిరిగినా ప‌రుశురాంను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. అయితే ప‌రుశురాం ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా త‌న క‌థ‌తో రీసెంట్‌గా నాగ‌చైత‌న్య‌ను క‌లిశాడు. చైతుకి క‌థ న‌చ్చ‌డంతో ఆయ‌న ఓకే చెప్పాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభం కానున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.

More News

‘రంగమార్తాండ’లో ప్రకాష్ రాజ్ కుమార్తెగా శివాత్మిక!

సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఓ మంచి హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీతో కృష్ణవంశీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఏపీలో సంక్రాంతి, క్రిస్మస్ సెలవులు ఇవే.. పండుగే పండగ!

పిల్లలు, పెద్దలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సరిగ్గా నెలరోజుల్లో సంక్రాంతి రానుంది. అయితే ఈ పండుగకు గాను ప్రభుత్వం ఎప్పుడెప్పుడు సెలవులు ఇస్తుందో..? ఎన్నిరోజులు సెలవులు ఇస్తుందో..?

జ‌య‌ల‌లిత బ‌యోపిక్స్‌కి తొల‌గిన అడ్డంకులు

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి, విప్ల‌వ నాయ‌కురాలు జ‌య‌ల‌లిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని రెండు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ తెర‌కెక్కుతోంది. అయితే వీటికి జ‌య‌ల‌లిత మేన‌కోడ‌లు దీపా జ‌య‌కుమార్

పవన్ రాజకీయాలకు పనికిరాడు: ప్రాణ స్నేహితుడు షాకింగ్ కామెంట్స్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఊహించని రీతిలో భారీ షాక్‌ తగిలింది. పవన్‌ అత్యంత సన్నిహితుడు, జనసేన పార్టీ పెట్టడానికి కర్త, కర్మ, క్రియ అయినటువంటి రాజు రవితేజ్‌ పార్టీకీ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.

ప్ర‌భాస్‌కి దిమ్మ తిరిగే అడ్వాన్స్‌

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు నేష‌న‌ల్ హీరో అయ్యాడు. `బాహుబ‌లి` సినిమా సాధించిన భారీ విజ‌యంతో ఇప్పుడు ఆయ‌నతో సినిమాలు చేయాల‌ని చాలా మంది ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారు.