close
Choose your channels

'థ్యాంక్స్ సామ్' సమంత ట్వీట్‌కు చైతూ రిప్లయ్.. ఇప్పటికైనా రూమర్లు ఆగుతాయా..?

Tuesday, September 14, 2021 • తెలుగు Comments

థ్యాంక్స్ సామ్ సమంత ట్వీట్‌కు చైతూ రిప్లయ్.. ఇప్పటికైనా రూమర్లు ఆగుతాయా..?

టాలీవుడ్‌లోని సెలబ్రెటీ కపుల్స్‌లో ఒకటైన అక్కినేని నాగచైతన్య, సమంతల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ తమ వివాహ బంధానికి త్వరలో గుడ్ బై చెప్పనున్నారని.. విషయం ప్రస్తుతం కోర్టు స్టేజ్‌లో వుందని సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం సినిమాలపై కాస్త అవగాహన వున్న ఏ ఇద్దరూ కలిసినా సామ్ చై విడాకులపైనే చర్చించుకుంటున్నారు. ఈ రూమర్లపై మొన్నామధ్య సమంత కౌంటర్ వేసింది. అయినప్పటికీ మీడియాలో వీరి విడాకుల ప్రచారం మాత్రం ఆగడంలేదు. తాజాగా మరోసారి ఈ వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది సమంత.

నాగ చైతన్య - సాయి పల్లవి నటించిన 'లవ్ స్టోరీ' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే సోమవారం సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది మూవీ యూనిట్. ఈ సందర్భంగా ఈ ట్రైలర్‌ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు చైతూ. 'లవ్ స్టోరీ' టీమ్ కి తన విషెస్ చెబుతూ.. భర్త పెట్టిన పోస్ట్ కి రిప్లై ఇస్తూ.. విన్నర్ అంటూ చిత్ర యూనిట్ కి, సాయి పల్లవికి ఆల్ ది బెస్ట్ చెప్పింది సమంత. ఈ ట్వీట్ చూసిన అక్కినేని ఫ్యాన్స్.. చైతూ-సమంతలు బాగానే ఉన్నారని.. విడాకుల వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని చర్చించుకుంటున్నారు.

అయితే ఈ ట్వీట్ లో సమంత ఎక్కడా చైతు పేరు మాత్రం చెప్పలేదు. దీంతో కొందరు నెటిజన్లు మళ్లీ నెగెటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. చైతూ మీద కోపంతోనే అతడిని ట్యాగ్ చేయలేదని కొందరు అంటుంటే.. చైతన్య ట్వీట్‌కే సమంత రిప్లై ఇచ్చినప్పుడు ప్రత్యేకంగా ఆయన పేరు చెప్పడం ఎందుకని.. మరికొందరు సామ్‌ని సమర్థిస్తున్నారు. విడాకుల వ్యవహారాన్ని సమంత ఇలా పరోక్షంగా కొట్టిపారేసిందని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

ఇక తన ‘‘లవ్ స్టోరీ’’ ట్రైలర్‌ను ప్రశంసించిన సినీ ప్రముఖులకు నాగచైతన్య ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. తన తండ్రి నాగార్జున ట్వీట్‌కు రిప్లయ్ ఇస్తూ థ్యాంక్స్ చెప్పాడు. ఇదంతా నిన్నటి సంగతి. సోమవారం ఒక్క సమంతకు తప్ప.. తనకు విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి రిప్లయ్ ఇచ్చాడు చైతూ. దీనిపైనా ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. ఇలాంటి వారందరికీ చెక్ పెడుతూ.. మంగళవారం ఉదయం తన భార్య, హీరోయిన్ సమంతకు సైతం నాగచైతన్య కృతజ్ఞతలు తెలిపాడు. ఈమేరకు ‘‘ థ్యాంక్స్ సామ్’’ అంటూ ట్వీట్ చేశాడు చైతన్య. ఈ ట్వీట్‌తో ఇప్పటి వరకు ఈ జంటపై వస్తున్న ఊహాగానాలకు తెరపడుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz