‘వెంకీమామ’లో ట్విస్ట్ చెప్పిన చైతూ

  • IndiaGlitz, [Wednesday,December 11 2019]

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య.. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ నటీనటులుగా బాబీ తెరకెక్కించిన చిత్రం ‘వెంకీ మామ’. ఈనెల 13న గ్రాండ్‌గా ‘వెంకీ మామ’ థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు. ఈ సందర్భంగా సినిమా యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఇందులో భాగంగా యంగ్ హీరో.. వెంకీ మేనల్లుడు నాగచైతన్య ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

సినిమా గురించి..!
సురేష్ బాబు గారు నాకు ఎప్పట్నుంచో లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్‌కి సంబంధించిన ఎన్నో స్క్రిప్ట్స్ పంపించారు. కానీ.. అనుకోని కారణాల వలన అవేవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికి ‘వెంకీ మామ’ చిత్రంతో కుదిరింది. చదువు కోసం సిటీ వెళ్లి అక్కడే పెరిగి.. హాలిడేస్‌కి పల్లెటూరికి వచ్చిన అబ్బాయిగా నేను కనిపిస్తాను. నేను ఆర్మీలో ఎందుకు జాయిన్ అవ్వాల్సివచ్చింది..? కారణాలేంటి..? అనేదే సినిమాలో అసలు ట్విస్ట్. రాశీ ఖన్నా ఇన్నేళ్ళలో నటన పరంగా ‘మనం’ తర్వాత ఆమెలో చాలా మార్పులు వచ్చాయి. ఆమె నటించిన ‘తొలిప్రేమ’ చిత్రం అంటే నాకు చాలా ఇష్టం. ఈ మూవీలో మా కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ అభిమానం కలిగిన మామ అల్లుళ్ళ మధ్య నడిచే ఫన్, ఎమోషన్స్ శాక్రిఫైస్ అనేది ఈమూవీకి హైలెట్. అందరికీ కనెక్ట్ ఐయ్యే కాన్సెప్ట్‌తో వెంకీ మామ తెరకెక్కింది. సినిమాలో నేనేమీ పెద్దగా కష్టపడలేదు.. కానీ యూనిట్ మాత్రం రోజు ఆ ఎక్యూప్మెంట్ మోస్తూ రెండు గంటలు మంచులో నడవాల్సివచ్చేది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను’ అని నాగచైతన్య చెప్పుకొచ్చాడు.

More News

జగన్ సర్కార్‌ కొత్త బిల్లు: రేప్ చేస్తే మరణ శిక్షే..

మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని హోం మంత్రి మొదలుకుని..

'వీరశాస్త అయ్యప్ప కటాక్షం'కు ఇది తొలి విజయం!! 

100 క్రోర్స్ అకాడమీ, వరాంగి మూవీస్ పతాకంపై రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) దర్శకతంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త  వి.ఎస్.పి.తెన్నేటి-టి.ఎస్.బద్రిష్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న

ఊల్లాల ఊల్లాల చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన - కేటీఆర్

నటరాజ్, నూరిన్, అంకిత హీరో-హీరోయిన్లు గా రూపొందుతున్న చిత్రం "ఊల్లాల  ఊల్లాల". సీనియర్ నటుడు 'సత్య ప్రకాష్"

‘లోకేశ్‌ను చూస్తే వణకు.. బాలయ్యకు బాబు అన్యాయం’

వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా ఎలాంటి వారిపై అయినా విమర్శలు గుప్పించడంలో ముందు వరుసలో ఉంటారన్న విషయం తెలిసిందే.

జనసేనానికి ఝలక్ ఇచ్చిన ఏకైక ఏమ్మెల్యే!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘోరంగా ఓటమిపాలైనప్పటికీ..