స‌మంత‌తో త‌న పెళ్లి ఎప్పుడో చెప్పిన చైత‌న్య‌..!

  • IndiaGlitz, [Wednesday,October 05 2016]

నాగ‌చైత‌న్య - స‌మంత ప్రేమ‌లో ప‌డ‌డం, ఆత‌ర్వాత పెద్ద‌ల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే...పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు..? ఏ సంప్ర‌దాయం ప్ర‌కారం చేసుకోబోతున్నారు..? అనేదే తెలియాల్సి ఉంది.ఇదిలా ఉంటే... చైత‌న్య న‌టించిన‌ ప్రేమ‌మ్ చిత్రం ద‌స‌రా కానుక‌గా ఈనెల 7న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన చైత‌న్య పెళ్లి విష‌యాల పై క్లారిటీ ఇచ్చేసాడు. మీరు హిందు, స‌మంత క్రిస్టియ‌న్. ఏ సంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లి చేసుకోబోతున్నారు అని అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చైతు...

రెండు సంప్ర‌దాయాల్లో పెళ్లి చేసుకుంటాం. అది కూడా ఏదో సీక్రెట్ గా కాకుండా అంద‌రి స‌మ‌క్షంలోనే పెళ్లి చేసుకుంటాం అని తెలిపారు. ఇంత‌కీ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అని అడిగిన ప్ర‌శ్న‌కు....వ‌చ్చే సంవ‌త్స‌రం పెళ్లి చేసుకుంటాం. అయితే...నా క‌న్నా అఖిల్ పెళ్లే ముందు జ‌రుగుతుంది అని చెప్పారు చైతు..!

More News

ఆ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కే మ‌ళ్లీ ఆఫ‌ర్ ఇచ్చిన త్రివిక్ర‌మ్..!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్...ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ చిత్రం చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో రూపొందే ఈ భారీ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ (చిన‌బాబు) నిర్మించ‌నున్నారు.

జ‌త‌గా చిత్రానికి సెన్సార్ యు/ఎ

రింగులజుత్తు సోయ‌గం నిత్యామీన‌న్ - దుల్కార్ స‌ల్మాన్ కాంబినేష‌న్ అంటేనే యువ‌త‌రంలో విప‌రీత‌మైన‌ క్రేజు. మ‌ల‌యాళంలో వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ల త‌ర్వాత ఈ జంట న‌టించిన `ఓకే బంగారం` తెలుగులో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌. దుల్కార్‌-నిత్యా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `జ‌త‌గా`. మ‌ల‌యాళంలో జాతీయ అవార్డులు సంపాదించిన `ఉస్తాద్ హోట‌ల్‌`ని `జ‌

రోబో సీక్వెల్ రిలీజ్ డేట్....

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్, అక్షయ్ కుమార్, ఎమీజాక్సన్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం 2.0 సీక్వెల్ ఆఫ్ రోబో. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ ఫైట్ రీసెంట్ గా పూర్తయ్యింది.

పోకిరి మహేష్ తరహాలో కల్యాణ్ రామ్....

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే హీరోలకు మాస్ ఇమేజ్ ను తెచ్చి పెట్టడంలో తనొకొక ప్రత్యేకమైన స్టయిల్ ఉంది. అందుకే హీరోలందరూ పూరి జగన్నాథ్ సినిమాలో నటించాలని ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం పూరి డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఇజం.

నేడే ఇజం ఆడియో రిలీజ్..!

డేరింగ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం ఇజం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మించారు. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ ప‌వ‌ర్ ఫుల్ జ‌ర్న‌లిస్ట్ గా న‌టించారు.