close
Choose your channels

ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో చైతు రోల్‌...

Sunday, February 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో చైతు రోల్‌...

అక్కినేని నాగ‌చైత‌న్య ఇప్పుడు మ‌జిలీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే మేన‌మామ విక్ట‌రీ వెంక‌టేష్‌తో క‌లిసి `వెంకీ మామ‌`లో న‌టించ‌నున్నాడు. ప‌వ‌ర్‌, జైల‌వ‌కుశ చిత్రాల ద‌ర్శ‌కుడు బాబీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ప‌ల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌బోయే ఈ సినిమాలో చైత‌న్య రోల్ ఇంట్రెస్టింగ్‌గా డిజైన్ చేశాడ‌ట డైరెక్ట‌ర్ బాబీ.

వివ‌రాల ప్ర‌కారం చైత‌న్య ఈ చిత్రంలో ఆర్మీలో ప‌నిచేస్తుంటాడ‌ట‌. మ‌రో వైపు ఓ ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరీ కూడా ర‌న్ అవుతుంటుంద‌ట‌. అలాగే వెంకీ క్యారెక్ట‌ర్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంద‌ట‌. చైత‌న్య జోడిగా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. రాజ‌మండ్రిలో ఈ నెల 22 నుండి షూటింగ్ ప్రారంభం కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.