చైతు సాహ‌సం శ్వాస‌గా సాగిపో వ‌చ్చేస్తుంది..!

  • IndiaGlitz, [Monday,October 24 2016]

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన ప్రేమ‌మ్ ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన స‌క్సెస్ సంతోషంతో చైతు సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. చైత‌న్య‌, గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ కాంబినేష‌న్లో రూపొందిన ఏమాయ చేసావే చిత్రం సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో...అదే కాంబినేషన్ లో రూపొందిన ఈ మూవీ పై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

అయితే..ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ కొన్ని కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది. ఇక‌ ఈ మూవీ గురించి లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే....డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...త‌మిళ వెర్షెన్ కు సంబంధించిన ట్రైల‌ర్ రిలీజ్ చేసి ప్ర‌మోష‌న్స్ కు శ్రీకారం చుట్టారు. ఆ ట్రైల‌ర్ ద్వారా న‌వంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న‌ట్టు తెలియ‌చేసారు. మ‌రి...ప్రేమ‌మ్ తో సూప‌ర్ స‌క్సెస్ సాధించిన చైత‌న్య సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రంతో ఆ స‌క్సెస్ కంటిన్యూ చేస్తార‌ని ఆశిద్దాం..!

More News

ప‌వ‌ర్ స్టార్ కాట‌మ‌రాయుడు రిలీజ్ డేట్..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం కాట‌మ‌రాయుడు. ఈ చిత్రాన్ని గోపాల గోపాల ఫేమ్ డాలీ తెర‌కెక్కిస్తున్నారు. ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

హాలీవుడ్ న‌టుడితో ధ‌నుష్‌

సౌత్‌లోనే కాదు, నార్త్‌లో కూడా ధ‌నుష్‌కు ఓ స్పెష‌ల్ క్రేజ్ ఉంది. అందుకే ధ‌నుష్ ద‌క్షిణాది సినిమాల‌తో పాటు ఉత్త‌రాది సినిమాల‌ను కూడా చేస్తుంటాడు.

పాలకొల్లులో నాగ అన్వేష్ ఏంజెల్ సందడి

యంగ్ హీరో నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బాపటెల్ కలయికలో తెరకెక్కుతోన్న సినిమా ఏంజెల్. రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే హైదరాబాద్ పరిస‌ర ప్రాంతాల్లో తొలి దశ షూటింగ్ పూర్తి చేసుకుంది.

అఖిల్ థర్డ్ ఫిల్మ్ గురించి ఇంట్రస్టింగ్ డీటైల్స్..!

అక్కినేని అఖిల్ మాస్ ఆడియోన్స్ ఆకట్టుకోవడం కోసం చేసిన తొలి చిత్రం అఖిల్ ఆకట్టుకోలేక పోయిన విషయం తెలిసిందే.

ఆ స్పూర్తితోనే నందిని న‌ర్సింగ్ హోమ్ క‌థ రాసాను..అంత మంది రైట‌ర్స్ అలా చెప్ప‌డంతో నాలో న‌మ్మ‌కం పెరిగింది - డైరెక్ట‌ర్ పి.వి.గిరి

ప్ర‌ముఖ ద‌ర్శ‌కురాలు విజ‌య‌నిర్మ‌ల మ‌న‌వ‌డు న‌వీన్ వికె హీరోగా పి.వి గిరి తెర‌కెక్కించిన చిత్రం నందిని న‌ర్సింగ్ హోమ్. ఈ టైటిల్ కి ఇక్క‌డ అంతా క్షేమ‌ము అనేది ట్యాగ్ లైన్. న‌వీన్, నిత్యా, శ్రావ్య హీరో, హీరోయిన్స్ గా న‌టించిన నందిని న‌ర్సింగ్ హోమ్ చిత్రాన్ని ఎస్.వి.పి ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై రాధా కిషోర్ జి, భిక్ష‌మ‌య్య సంగం సం&