చైతు టైటిల్ చాలా ఇష్టం అంటున్ననాగ్..

  • IndiaGlitz, [Wednesday,March 02 2016]

టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ఊపిరి. వంశీ పైడిప‌ల్లి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. గోపీ సుంద‌ర్ సంగీతం అందించిన ఊపిరి ఆడియో వేడుక నిన్న రాత్రి నోవాటెల్ హాట‌ల్లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌లో నాగ్ మాట్లాడుతూ....చైతు సినిమా టైటిల్ సాహ‌సం శ్వాస‌గా సాగిపో చాలా ఇష్టం. ఎందుకంటే సాహ‌సంతోనే శివ‌, గీతాంజ‌లి, నిన్నే పెళ్లాడ‌తా, అన్న‌మ‌య్య‌, సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రాలు చేసాను.

నిన్నే పెళ్లాడ‌తా త‌ర్వాత అన్న‌మ‌య్య సినిమా చేస్తుంటే నీకు అన్న‌మ‌య్య సినిమా అవ‌స‌ర‌మా అన్నారు. కానీ నేను సాహ‌సంతో ఆ నిర్ణ‌యం తీసుకున్నాను. ఇప్పుడు ఊపిరి కూడా అంతే సాహ‌సంతో చేసాను. ఖ‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చుతుంది అనే న‌మ్మ‌కం ఉంది అన్నారు. నాగ్ మాట‌లు...సినిమా ట్రైల‌రు చూస్తుంటే ఊపిరి నాగ్ కెరీర్ లో మ‌ర‌చిపోలేని చిత్రంగా నిల‌వ‌డం ఖాయం అనిపిస్తుంది అది సంగ‌తి.

More News

రోహిత్ సావిత్రికి ముఖ్య అతిథిగా బాలయ్య...

యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తొలి చిత్రం బాణం నుండి అసుర వరకు విభిన్న కథాంశాలతో సినిమాలను చేస్తున్న హీరో.ప్రతి స్క్రిప్ట్ ను విలక్షణంగా ఎంచుకుంటూ ఇటు ప్రేక్షకులు,ఇండస్ట్రీ వర్గాల్లో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న హీరో నారారోహిత్

సూర్య 24 టీజర్ రిలీజ్ డేట్...

తమిళ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం 24.ఈ చిత్రాన్ని మనం ఫేం విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు.

'టెర్రర్ ' సక్సెస్ మీట్

శ్రీకాంత్,నికిత హీరో హీరోయిన్లుగా భారత క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం'టెర్రర్'.

అమల అక్కినేని చేతుల మీదుగా నాగ్ ఊపిరి ఆడియో విడుదల

టాలీవుడ్ కింగ్ నాగార్జున-కోలీవుడ్ హీరో కార్తీ -మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్లో రూపొందిన భారీ క్రేజీ మూవీ ఊపిరి.ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించారు.

బన్ని మనసు దోచుకున్న క్షణం...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సరైనోడు సినిమా బిజీలో ఉన్నారు.