'లవ్ స్టోరి' సెప్టెంబర్ 24న విడుదల

  • IndiaGlitz, [Friday,September 10 2021]

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా లవ్ స్టోరి. ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ లలో విడుదలవుతున్న ప్రెస్టీజియస్ మూవీ లవ్ స్టోరి కావడం విశేషం. రేవంత్, మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియెన్స్ చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. సెప్టెంబర్ 24న లవ్ స్టోరి థియేటర్ రిలీజ్ కు అటు ఎగ్జిబిషన్ సెక్టార్ లోనూ ఉత్సాహం నింపబోతోంద

ఈ సందర్భంగా..

దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ... తప్పనిసరి పరిస్థితుల వల్ల ఇన్నాళ్లూ మా లవ్ స్టోరి చిత్రాన్ని వాయిదా వేస్తూ వచ్చాం. మా సినిమాను మీకు ఎప్పుడు చూపించాలి అనే ఆత్రుతగా సరైన సమయం కోసం వేచి చూశాం. ఆ గుడ్ టైమ్ రానే వచ్చింది. ఈ నెల 24న లవ్ స్టోరి చిత్రాన్ని థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. థియేటర్లలో కలుసుకుందాం. వినాయక చవితి శుభాకాంక్షలు అన్నారు.

లవ్ స్టోరి సినిమాలో పాటలు అనూహ్య ఆదరణ పొందాయి. యూట్యూబ్ వ్యూస్ లో 'సారంగదరియా' ఆల్ టైమ్ రికార్డులు తిరగరాసింది. 'హే పిల్లా', 'నీ చిత్రం చూసి..' పాటలు కూడా మ్యూజిక్ లవర్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించాయి. లవ్ స్టోరి మ్యూజికల్ గా హిట్ అవడం సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల చూపించబోయే ప్లెజంట్, ఎమోషనల్ ప్రేమ కథకు ఈ పాటలు అదనపు ఆకర్షణ కానున్నాయి.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ''లవ్ స్టోరి'' చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటించారు.

సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, ఎడిటర్ : మార్తాండ్ కె.వెంకటేష్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి, పిఆర్ఓ : జి.ఎస్.కె. మీడియా , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర రావు, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు, రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

More News

'బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫ్ ర్' ఫస్ట్ లుక్ టైటిల్ లోగో లాంఛ్ చేసిన స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి

ఇంద్రసేన, సంతోష్ రాజ్, మెరిన్ ఫిలిప్, ప్రగ్యా నయన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "బద్మాష్ గాళ్లకు బంపర్ ఆఫ్ ర్".

తెలుగు, హిందీ  భాషల్లో థియేటర్స్ లలో విడుదలకు సన్నాహాలు చేసుకొంటున్న 'స్ట్రీట్ లైట్'

మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా

‘సీటీమార్‌’ థియేట‌ర్స్‌లో చూసే సినిమా.. త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో గోపీచంద్‌

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన భారీ స్పోర్ట్స్ క‌మ‌ర్షియ‌ల్ యాక్షన్ డ్రామా‌ ‘సీటీమార్‌’.

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల బ్లాక్ బస్టర్ కాంబినేషన్ చిత్రం 'భవదీయుడు భగత్ సింగ్'

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ చిత్రం పేరిది. విజయవంతమైన చిత్రాల కథానాయకుడు, దర్శకుడు కాంబినేషన్

పెద్ద‌లు నేర్పిన నీతి నిజాయితీకి క‌ట్టుబ‌డి ఎదిగానుః న‌ట్టికుమార్‌

`చిన్న సినిమాలు బ‌త‌కాల‌నే నేను మొద‌టి నుంచి కోరుకుంటున్నా. ఆ క్ర‌మంలో నేను ఏం మాట్లాడినా పెద్ద‌లు సీరియ‌స్‌గా తీసుకోలేదు.