close
Choose your channels

'శైలజా రెడ్డి అల్లుడు' డేట్ క‌న్‌ఫ‌ర్మ్‌

Tuesday, July 31, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాగ‌చైత‌న్య, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం `శైల‌జారెడ్డి అల్లుడు`. `మ‌హానుభావుడు` వంటి ఘ‌న‌విజ‌యం త‌రువాత మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రమిది. సినిమాలో ర‌మ్య‌కృష్ణ అత్త‌ పాత్ర పోషిస్తోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీసుంద‌ర్ సంగీత‌మందిస్తున్నారు.

ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాను ఆగ‌స్ట్ 31న విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. చైత‌న్య త‌న త‌దుప‌రి చిత్రం స‌వ్య‌సాచిని సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఓ పాట‌.. కొంత టాకీ మాత్ర‌మే మిగిలి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.