ఫిబ్రవరి 14న మజిలీ టీజర్ విడుదల

  • IndiaGlitz, [Tuesday,February 12 2019]

పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న తొలి సినిమా మజిలీ. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్ విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు చిత్ర యూనిట్.

వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న మజిలీ చిత్ర టీజర్ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య, సమంత కలిసి ఉన్న పోస్టర్ విడుదల చేశారు. నిన్ను కోరి లాంటి ఎమోషనల్ ఎంటర్టైనర్ తర్వాత శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న చిత్రం మజిలీ. చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. దివ్యాంశా కౌశిక్ ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా నటిస్తున్నారు.

దేర్ ఈజ్ లవ్ దేర్.. ఈజ్ పెయిన్ అనే క్యాప్షన్ తో మజిలీ సినిమా వస్తోంది. రావు ర‌మేష్, పోసాని కృష్ణ‌ముర‌ళి, సుబ్బ‌రాజ్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా.. విష్ణు వ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యాన‌ర్ పై సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది మ‌జిలీ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎప్రిల్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

More News

నిర్మాత సురేష్ బాబు చేతుల మీదుగా 'అంజలి CBI' చిత్ర ట్రైలర్ విడుదల

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ ఇమైక్క నోడిగల్. ఈ చిత్రాన్ని తెలుగులో అంజలి సిబిఐ పేరుతో అనువదిస్తున్నారు.

'లవర్స్ డే' అద్భుతమైన ఫీల్ ఉన్న చిత్రం: నిర్మాత

ఒకే ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా సంచలన రేపిన ప్రియా ప్రకాశ్ వారియర్, రావూఫ్ రోషన్ జంటగా నటించిన ''లవర్స్ డే ''(మలయాళంలో ఒరు ఆడార్ లవ్) చిత్రం రిలీజ్‌కు ముస్తాబైంది.

'నాగకన్య' ట్రైలర్ కు అద్భుతమైన స్పందన

వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న తాజా చిత్రం నాగకన్య. జర్నీ, రాజా రాణి చిత్రాల ఫేమ్ జై హీరోగా నటిస్తున్నారు.

గ‌బ్బ‌ర్‌సింగ్ గ్యాంగ్‌తో 'వాల్మీకి'

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన `జిగ‌ర్ తండా` చిత్రాన్ని తెలుగులో `వాల్మీకి` పేరుతో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

చైతు, నాని బాక్సాఫీస్ పోటీ...

అక్కినేని నాగ‌చైత‌న్య‌, నాని పోటీ ప‌డ‌నున్నారు. ఎందులో.. ఎక్క‌డో అనుకుంటున్నారు. బాక్సాఫీస్ వ‌ద్దేనండీ!. వివ‌రాల్లోకెళ్తే..