చైతు, సమంతల స్పెషల్ పూజలు...

  • IndiaGlitz, [Monday,September 26 2016]

అక్కినేని నాగ‌చైత‌న్య‌, హీరోయిన్ స‌మంత‌లు ఇప్పుడు ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఏడాది వీరి పెళ్ళి ఉంటుంద‌ని అంద‌రికీ అన‌ధికార‌కంగా తెలిసిందే. అయితే ఎక్క‌డా అధికార‌కంగా ఎవ‌రూ చెప్ప‌లేదు. అయితే అక్క‌డ‌క్క‌డ వీరి మ‌ధ్య సానిహిత్యాన్ని తెలియ‌జేసేలా కొన్ని ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తాజాగా నిన్న మ‌రికొన్ని ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌డం, వాటిలో హీరో నాగార్జున ఉండ‌టంతో వీరి బంధానికి ఇంకా రుజువులు దొరికిన‌ట్టు అయ్యాయి. అయితే నిన్న విడుద‌లైన చైతు, స‌మంత‌ల ఫోటోల్లో ఇద్ద‌రూ వేద పండితులతో ఏదో పూజ‌ల‌కు కూర్చొని ఉన్న‌ట్లు తెలుస్తుంది. పెళ్ళికి ముందు జ‌రిపే దోష నివార‌ణ పూజ‌లు చేసిన‌ట్టు ఫిలింన‌గ‌ర్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి.