‘థాంక్యూ’ అనబోతున్న చైతన్య!

  • IndiaGlitz, [Saturday,March 07 2020]

అక్కినేని నాగచైత‌న్య ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ‘ల‌వ్‌స్టోరి’ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం మే 29న విడుదలవుతుందని వార్తలు వినపడుతున్నాయి. ఈ చిత్రం త‌ర్వాత చైత‌న్య 13బి, మ‌నం, హ‌లో, గ్యాంగ్ లీడ‌ర్ చిత్రాల ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్.. చైత‌న్య‌తో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాడని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ చిత్రానికి ‘థాంక్యూ’ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

నిజానికి ‘ల‌వ్‌స్టోరి’ త‌ర్వాత చైతు హీరోగా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై సినిమా చేయ‌డానికి రెడీ అయిపోయాడు. సినిమాకు ‘నాగేశ్వ‌ర‌రావు’ అనే టైటిల్ పెట్టారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా దాదాపు పూర్త‌య్యాయి. అంతా ఓకే అనుకుంటోన్న త‌రుణంలో హీరో మ‌హేశ్ లైన్‌లోకి రావడంతో పరుశురాం..చైతు సినిమాను హోల్డ్‌లో పెట్టి మ‌హేశ్ సినిమా చేయ‌డానికి రెడీ అయిపోయాడు. ‘గ్యాంగ్ లీడ‌ర్’ డిజాస్ట‌ర్ త‌ర్వాత విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించ‌బోయే చిత్ర‌మిదే.

‘మజిలీ’, ‘వెంకీమామ’ చిత్రాల తర్వాత నాగచైతన్య హీరోగా నటిస్తోన్నచిత్రం ’లవ్‌స్టోరి’శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది.

More News

రామ్ ఆ డైరెక్ట‌ర్‌కి ఓకే చెబుతాడా?

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ప్ర‌స్తుతం ‘రెడ్’ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తి కాగానే రామ్ ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు కానీ..

చ‌ర‌ణ్ నెక్స్‌ట్ మూవీ కొత్త ద‌ర్శ‌కుడితోనా?

కెరీర్ ప్రారంభంలో చిరుత‌, ర‌చ్చ వంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసినా.. ‘రంగ‌స్థ‌లం’ వంటి భారీ హిట్ త‌ర్వాత మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్

ప‌వ‌న్ 27 రిలీజ్ డేట్‌... ఫ్యాన్స్‌కు పండ‌గే..

తాజాగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ ‘వ‌కీల్ సాబ్‌’ షూటింగ్‌ను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు.

'పలాస 1978' థాంక్స్ మీట్

రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో

ప్రేక్షకుల కోరిక మేరకు ‘కనులు కనులను దోచాయంటే’ థియేటర్లు పెంచుతున్నాం - కెఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్స్‌

పెద్ద చిత్రాల నుండి చిన్న చిత్రాల వరకూ... కొన్నేళ్లుగా నిర్మాతలు అనుసరించే సూత్రం ఒక్కటే! వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేసి,